పరీక్షిత్తు (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
మహాభారతంలో ధర్మరాజు మనవడు, పాండవుల వారసుడూ అయిన పరీక్షిత్తు జీవనాన్ని గురించిన ఐతిహ్యాలను శాస్త్రీయంగా విశ్లేషించిన గ్రంథమిది.
== రచన నేపథ్యం ==
మహాభారత ఇతివృత్తం నుంచి స్వీకరించిన ఇతివృత్తాన్ని తన హేతువుతో, చరిత్ర జ్ఞానంతోనూ పరిశీలించి పరీక్షిత్తు అనే ఈ గ్రంథాన్ని [[పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి]] రచించారు.
 
== విషయ సంగ్రహం ==
మహాభారతంలో పాండవుల వారసుడైన పరీక్షిత్తు జీవితం గురించి ఈ కథలో అధ్యాయాలుగా వివరించారు. పరీక్షిత్తు జననానికి పూర్వరంగం, పరీక్షిత్తు జననం, ధర్మరాజు అశ్వమేధ యాగం, ఆపైన సంఘటనలు, పరీక్షిత్తు బాల్యం, మహాభారత యుద్ధం, పాండవుల పాలన, వారి మహాప్రస్థానం, పరీక్షిత్తు పాలన మొదలైన విషయాలు అధ్యాయాలుగా ఉన్నాయి. మహాభారతంలో పాండవుల వారసునిగా, భాగవతంలో భాగవత శ్రోతగా పరీక్షిత్తు ప్రవర్తిల్లుతాడు. ఇలాంటి పాత్ర జీవితక్రమాన్ని సామాజిక శాస్త్రం, శాస్త్రీయ దృక్కోణాలలో రచించడం విశేషం.