జానమద్ది హనుమచ్ఛాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
'''జానమద్ది హనుమచ్ఛాస్త్రి''' తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత.
 
===జీవిత విశేషాలు==
ఇతడు [[ సెప్టెంబరు 5]], [[1926]] లో [[అనంతపురం]] జిల్లా [[రాయదుర్గం]] లో జన్మించాడు. [[రాయదుర్గం]] జిల్లా బోర్డు హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి చదివాడు. ప్రైవేటుగా బి.ఎ. ఉత్తీర్ణుడైనాడు. బి.ఇడి. కూడా పూర్తి చేశాడు. స్వయంకృషితో తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు.
 
1946లో [[బళ్ళారి]] లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. [[కడప]] లో [[సి.పి.బ్రౌన్]] స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించి, బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు. 'బ్రౌన్ శాస్త్రి'గా పేరు గడించాడు. కడపజిల్లా రచయితల సంఘం 1973లో స్థాపించి 20ఏళ్లు కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్రంలోని సుప్రసిద్ధ రచయితలను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఇతనిదే. [[బెజవాడ గోపాలరెడ్డి]], [[ఆరుద్ర]], [[దాశరథి]], [[కుందుర్తి]], [[పురిపండ అప్పలస్వామి]], [[శ్రీశ్రీ]], [[సి.నా.రె.]],[[దేవులపల్లి రామానుజరావు]],[[దివాకర్ల వేంకటావధాని]] మొదలైన రచయితలను, విద్వాంసులను రప్పించి అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు.
 
==రచనలు==
జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసాడు. 16 గ్రంథాలు వెలువరించాడు. మా సీమకవులు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2, కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు, మన దేవతలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సి.పి.బ్రౌన్ చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురించాడు.
జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసాడు. 16 గ్రంథాలు వెలువరించాడు.
=== గ్రంథాల జాబితా===
# మా సీమకవులు
# నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర
# కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2
# కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు
# రసవద్ఘట్టాలు
# మన దేవతలు
# భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర
# సి.పి.బ్రౌన్ చరిత్ర
# మొండి గోడలనుంచి మహా సౌధం దాకా
# విదురుడు
# త్యాగమూర్తులు
# మనిషీ నీకు అసాధ్యమేదీ
# ఎందరో మహానుభావులు
# భారత మహిళ
# శంకరంబాడి సుందరాచారి
 
==పురస్కారాలు, సత్కారాలు==
కడపజిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా పనిచేశాడు.
శాస్త్రి కి అనేక అవార్డులు లభించాయి.
 
# పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు
శాస్త్రి కి అనేక అవార్డులు లభించాయి. గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు, అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు, ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు, కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు, మదనపల్లి భరతముని కళారత్న అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం, బెంగళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం వంటి అనేక పురస్కారాలు వీరికి లభించాయి.
# లోకనాయక్ ఫౌండేషన్ సాహితీపురస్కారం (2011)
# గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు
# అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు
# ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు
# కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు
# మదనపల్లి భరతముని కళారత్న అవార్డు
# తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం
# బెంగళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం
# ఉడిపి పెజావరు పీఠాధిపతిచే 'ధార్మికరత్న' బిరుదు
మొదలైన అనేక పురస్కారాలు ఇతనికి లభించాయి.
 
కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 28-ఫిబ్రవరి-2014 న వీరు పరమపదించారు.
Line 52 ⟶ 80:
==మూలాలు==
* [[కథా కిరణాలు]] : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.
* [[రాయలసీమ రచయితల చరిత్ర]] మూడవ సంపుటి - [[కల్లూరు అహోబలరావు]]-శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం- 1981.
 
{{wikisource author|జానమద్ది హనుమచ్ఛాస్త్రి}}
[[వర్గం:తెలుగు రచయితలు]]