ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది విస్తరణ
పంక్తి 38:
== పురుషులు టోపీ ధరించడం ==
[[ముహమ్మద్ ప్రవక్త]] ఎల్లప్పుడూ తలను పగడీ లేదా టోపీతో కప్పి ఉంచేవాడు. దీనిని అనుసరిస్తూ ముస్లింలలో పురుషులు టోపీలు ధరిస్తారు. పలు దేశాలలో పలు విధాలుగా ధరిస్తారు. టోపీలు సంస్కృతికి, సభ్యతకు మరియు గౌరవానికి ప్రతీకలు. ఇవి పలు రకాలు: టోపీ, ఫెజ్ వగైరా. కాని ఇది తప్పనిసరి కాదు. టోపీ లేకుండానే నమాజ్ చదివే ముస్లింలు మనకు అక్కడక్కడా గోచరిస్తారు.
 
==ఈద్ ముబారక్==
{{ప్రధాన వ్యాసం|ఈద్ ముబారక్}}
పండుగల సందర్భంగా [[ఈద్ ముబారక్]] తెలుపుతారు. "ఈద్ ముబారక్" అనగా "ఈద్ శుభాకాంక్షలు" లేదా "పండుగ శుభాకాంక్షలు". ప్రధాన పండుగలైన [[ఈదుల్ ఫిత్ర్]] (రంజాన్ పండుగ), మరియు [[ఈదుల్ అజ్ హా]] (బక్రీదు పండుగ) సందర్భంగా ఈద్ ముబారక్ అని సంబోధిస్తారు. అలాగే [[మీలాదున్ నబి]] (ముహమ్మద్ ప్రవక్త జన్మ దినం) సందర్భంగా "మీలాదున్నబి ముబారక్" అని సంబోధిస్తారు. పుట్టిన రోజు సందర్భంగా "యౌమ్ ఎ పైదాయిష్ ముబారక్" అనీ. అలాగే ఇతర మతస్తుల పండుగల సందర్భంగా "దీపావళి ముబారక్" అనీ, "క్రిస్మస్ ముబారక్" అనీ సంబోదిస్తారు.
 
== స్త్రీలు హిజాబ్ ధరించడం ==
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు