గణపతి సచ్చిదానంద స్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==జీవితం==
వీరు 1942 మే 26న జయలక్ష్మి, నరసింహశాస్త్రి దంపతులకు [[కర్ణాటక]] రాష్ట్రంలో కావేరి నదీ తీరాన "మేకెదాటు" అనే గ్రామంలో జన్మించారు. బిడ్డకు తల్లిదండ్రులు "సత్యనారాయణ" అనే పేరు పెట్టుకొన్నారు. (అతని తల్లి మెకెదాతు వద్ద్ద వున్న కావేరి నది ఒడ్డున ధ్యానంలో ఉన్న సమయంలో ఆ బిడ్డ జన్మించాడని, పుట్టినపుడే అతని నుదుట విభూతి బొట్టు ఉందనీ దత్తపీఠం వెబ్‌సైటులో ఉన్నది.) చిన్నతనం నుండే ఆ బాలుడు ఆధ్యాత్మిక సాధనల పట్ల, సంగీతం పట్ల విశేషమైన ఆసక్తి చూపారు. 1951లో అతని మాతృమూర్తి శివైక్యం చెందడానికి ముందు అతనికి దీక్షనొసగింది. మేనత్త వెంకాయమ్మ హఠయోగం నేర్పిందని ఆయన జీవిత చరిత్ర చెబుతోంది.