లక్క: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
 
==లక్క పుట్తుపూర్వోత్తరాలు==
లక్కకు పుట్టిల్లు భారతభూమి.లక్కను మహాభారతంలో చెప్పబడిన, పాండవులు వసించుటకై కౌరవులు నిర్మించిన '''లాక్షా గృహము''' ను బట్టి లక్కయొక్క పురాతనత మనకు తెలుస్తుంది.సంస్కృత శబ్దమైన '''లక్ష''' నుండి ఉత్పత్తి అయింది లక్క అనే పదం. లక్షలకొలదీ లక్క పురుగులచే స్వేదించబడిన మూలమునకో లేక, [[అధర్వణ వేదం ]] లో, లక్కను పండించు మోదుగ చెట్టు '''లక్షతరువు''' గా నెన్నబడిన కారణం చేతనో లక్కయను పదం వాడుకలోనికి వచ్చింది. క్రీ.శ. 10 వ శతాబ్దములో రచింపబడిన '''పెరిప్లస్''' (Periplus) అనే గ్రంధంలో, హిందూదేశమునుండి లక్కరంగు ఎర్రసముద్ర తీరమందలి ఆఫ్రికాఖండములోని ఆదులి (Aduli) కి గొంపోబడినదని వ్రాయబదియున్నది. మరియు క్రీ.శ. 150లో ఏరియను (Aerian) అను చరిత్రకారుడు తన గ్రంధములో, భారతదేశములో ఒక విధమైన పురుగు రంగు పదార్ధమునిచ్చునని వరాసియున్నాడు.1563లో గ్రేసియా డి ఆర్టా (Gracia De Arta) అను వైద్యుడు లక్కయొక్క జిగురు గురుంచి వ్రాసియున్నాడు. అటుపై 1590లో వెలువడిన '''అం న్-ఇ-అక్బరీ (Ain-I-Akbari)''' అను గ్రంధములో లక్క జిగురుతో రంగు మొదలైన తదితర పదార్ధములను చేర్చి వార్నిషు చేయబడిన వెదురు చాపలు ప్రభుత్వపు కచేరీలలోనూ, మహళ్ళలోనూ వాడుకలో ఉన్నట్లు యున్నది.
''''''లక్క పంట''' ఎలా పండిస్తారు.'''
[[లక్క]]ను కొన్ని దేశాలలో పంట గా పండిస్తున్నారు. లాక్సిఫెర్ లక్క అనె చిన్న కీటకాలు సహజమైన జిగురు పదార్థమే లక్క. ఈ కీటకాలు లార్వా దశలో వున్నప్పుడు కొన్ని రకాల చెట్ల కాండాలమీదకు చేరి వాటి రసాన్ని ఆహారంగా పీల్చి ఆతర్వాత జిగురు లాంటి పదార్తాన్ని విసర్జిస్తుంటాయి. ఈ పురుగు జీవిత కాలం ఆరు నెలలు మాత్రమె. ఒక చెట్టు నుండి ఏడాదికి రెండు [[లక్క పంట]]లను పండించ వచ్చు. ముందుగా ఆడ కీటకాలను చెట్ల మీదకు చేరుస్తారు. ఒక్కో పురుగు సుమారు వంద గ్రుడ్ల వరకు పెడుతుంది. సూర్య రస్మికి ఈ గ్రుడ్లు పొదగ బడి లార్వాలుగా మారి తల్లి నుండి వేరు పడి పాక్కుంటు చెట్ల కాండాలను చేరుకుంటాయి. ఈ లార్వాల లో ఆడ మగ కూడ వుంటాయి. ఇవి తమ పొడవాడి నోటి ద్వారా చెట్ల కాండం నుండి రసాన్ని పీల్చి తింటాయి. ఆ సమయంలో అవి తమ శత్రువుల నుండి రక్షణ కొరకు ఒక రకమైన జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. ఆ జిగురును తమ శరీరం చుట్టు కవచంగా ఏర్పరచుకొని శత్రువులనుండి రక్షణ పొందుతాయి. సుమారు ఎనిమిది వారాలకు ఈ లార్వాలు కీటకాలుగా మారుతాయి. కాని మగ పురుగులు మాత్రమె పూర్తి కీటకంగా రూపాంతరం చెందు తుంది. కాళ్లు రెక్కలు వచ్చిన మగ పురుగులు ఆడ పురుగుల వద్దకు వెళ్లి జత కడతాయి. కాని వెంటనే చనిపోతాయి. ఆడ పురుగులు కు కదలలేవు. వాటి నోటి బాగాలు మాత్రం అభివృద్ది చెందినా కాళ్లు, రెక్కలు రావు. ఈ ఆడ కీటకాలు ఆ కవచంలోనె గ్రుడ్లు పెట్టి అవి పొదగబడిన తర్వాత అందులోనె మరణిస్తుంది. ఇలా ఈ కీటకాల పై కవచంలాగ ఏర్పడి గట్టిపడిన జిగురు పదార్తమే లక్క. దీన్ని చెట్ల కొమ్మల నుండి సేకరించి దానిలో ఇరుక్కున్న కీటకాల భాగాలను, చెట్టుకొమ్మ బాగాలను వేరు చేసి శుబ్ర పరిచి కరిగించి బిళ్లల రూపంలోనో, లేదా కడ్డీల రూపంలో చేసి అమ్ముకుంటారు తయారి దారులు.
Line 23 ⟶ 25:
==ఉపయోగాలు==
* లక్క కీటాకాలు ఉన్న కొమ్మలను విరిచి, వాటికున్న లక్కను గీకి తీస్తారు. ఈ విధంగా లభించిన ముడి లక్కను 'స్టిక్ లాక్' (Sticklac) అంటారు. ఈ ముడిలక్కను కరిగించి శుద్ధిచేసి బిళ్ళలుగాను, కడ్డీలుగాను అచ్చులు పోస్తారు. శుద్ధి చేసిన ఈ లక్కను 'షెల్లాక్' (Shellac) అంటారు.
*Sealing Wax
*Polish for furniture
*బంగారు వెండి వస్తువులలో నింపుటకు (Filler)గా ఉపయోగపడుచున్నది.
 
[[వర్గం:కీటకాలు]]
"https://te.wikipedia.org/wiki/లక్క" నుండి వెలికితీశారు