పులిగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
 
==గ్రామంలోని దేవాలయాలు==
#ఈ గ్రామములో శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం:- చోళరాజుల కాలంనాటి ఈ ఆలయంలో ఉగాది, దసరా, ధనుర్మాస ఉత్సవాలతోపాటు, స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపెదరు. తిరుమల తరహాలో ఇక్కడ గూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగదైవం అయిన ఇక్కడి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనడానికి, జిల్లా నలుమూలలనుండి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ఆలయంలో నిర్మిస్తున్న నూతన రాజగోపురం, యాగశాల నిర్మాణం పూర్తయినది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రు.36.19 లక్షలతో నూతన రాజగోపురం, తలంబ్రాల కళ్యాణ మండపం, గర్భాలయ మరమ్మత్తు పనులు చేపట్టి పూర్తి చేశారు. నూతన రాజగోపురానికి శిల్పాలు అమర్చి, రంగులు దిద్దినారు. ఆలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మించుచున్నారు. త్వరలో ప్రారంభించెదరు. [3] & [5]
#పులిగడ్డ గ్రామంలో వేంచేసియున్న గ్రామదేవత పోలాశమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం (మే నెలలో) వైశాఖ శుక్ల పౌర్ణమి నుండి ప్రారంభం చేసెదరు. ఈ కార్యక్రమానికై ఆలయం ముంగిట, భక్తుల సౌకర్యార్ధం, చలువ పందిళ్ళు వేయుదురు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించెదరు. పౌర్ణమి రోజు ఉదయం 6 గంటలకు అమ్మవారు అఖండ నదీ స్నానానికి తరలి వెళ్ళెదరు. అనంతరం పోతురాజు సంబరం నిర్వహించెదరు. సాయంత్రం మూడు గంటల నుండి అమ్మవారికి గ్రామోత్సవం ప్రారంభించి, మరుసటిరోజు (బహుళ పాడ్యమి) కి అమ్మవారు ఆలయ ప్రవేశం అనంతరం గుడి సంబరం జరిపెదరు. [4]
 
"https://te.wikipedia.org/wiki/పులిగడ్డ" నుండి వెలికితీశారు