ఎస్.గంగప్ప: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{సమాచారపెట్టె వ్యక్తి | name = ఎస్.గంగప్ప | residence = | other_names = | image = | imagesize = | caption =...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
సాహితీపరిశోధకుడు, బహుగ్రంథకర్త అయిన '''ఎస్.గంగప్ప''' అనంతపురం జిల్లాకు చెందినవాడు.
 
==జీవిత విశేషాలు==
ఎస్.గంగప్ప 1936వ సంవత్సరం నవంబర్ నెల 8వతేదీన నల్లగొండ్రాయనిపల్లిలో వెంకటప్ప కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య [[సోమందేపల్లి]]లోను, మాధ్యమిక విద్య [[పెనుకొండ]]లోను జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఏ. ఆనర్స్ చదివాడు. [[వాల్తేరు]] [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] నుండి 1960లో ఎం.ఏ. పూర్తిచేశాడు. కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా "కోలాచలం శ్రీనివాసరావు - నాటక సాహిత్య సమాలోచనము" అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సాధించాడు. 1960లో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి కాకినాడ, విశాఖపట్టణం,హైదరాబాదు, కర్నూలు [[సిల్వర్ జూబ్లీ కళాశాల]] లలో ఆంధ్రోపన్యాసకునిగా, తెలుగు శాఖాధిపతిగా 1978 వరకు పనిచేశాడు. 1978నుండి నాగార్జున యూనివర్శిటీ ఆంధ్రోపన్యాసకుడిగా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1989-91లో తెలుగు ప్రాచ్యభాషాసంఘం అధ్యక్షుడిగా, 1994-96లో ఎం.ఏ పాఠ్యనిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా ఉండి 1996లో పదవీవిరమణ చేశాడు.
 
==సాహిత్యసేవ==
అనేక పత్రికలలో వివిధ సాహిత్యాంశాలపై వ్యాసాలను ప్రచురించాడు. అనేక సాహిత్య సదస్సులలో, గోష్టులలో పత్రసమర్పణ గావించాడు. అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేశాడు. సుమారు 100కుపైగా గ్రంథాలను వ్రాసి ప్రచురించాడు. అనేక సాహిత్యాంశాలపై రేడియో ప్రసంగాలు చేశాడు. ఇతడిని అనేక సంస్థలు సత్కరించాయి. అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు. కేంద్రసాహిత్య అకాడెమీ సీనియర్ ఫెలోషిప్‌ను పొందాడు. పదసాహిత్యంపై పరిశోధన జరిపాడు.
===రచనలు===
# క్షేత్రయ్య పదసాహిత్యం
# సారంగపాణి పదసాహిత్యం
# అన్నమాచార్యులు - ఇతర ప్రముఖ వాగ్గేయకారులు - తులనాత్మక అధ్యయనం
# తెలుగులో పదకవిత
# కోలాచలం శ్రీనివాసరావు (ఆం.ప్ర.సంగీత అకాడెమీ ప్రచురణ)
# తెలుగుదేశపు జానపదగీతాలు
# జానపద గేయరామాయణము
# జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం
# సాహిత్యసుధ
# ఉన్నవ లక్ష్మీనారాయణ సాహిత్యజీవితం
# సాహిత్యోపన్యాసములు
# భాషావ్యాసాలు
# తెలుగు నాటకం - ఆరంభం నుంచి అబ్సర్డు నాటకాలదాకా
# విశ్వనాథవారి వేయిపడగలు - విశ్లేషణాత్మక విమర్శ
# విశ్వనాథవారి నాటకాలు - విశ్లేషణ
"https://te.wikipedia.org/wiki/ఎస్.గంగప్ప" నుండి వెలికితీశారు