చందమామ: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె చేర్చితిని
మూలాల చేర్పు
పంక్తి 20:
}}
[[దస్త్రం:Chandamama-logo.jpg|right|150px|thumb|చందమామ లోగొ రాజా ర్యాబిట్]]
'''చందమామ''' సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. [[1947]] జూలై నెలలో [[మద్రాసు]] నుంచి [[తెలుగు]], [[తమిళ భాష]]ల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, [[సింగపూరు]], [[కెనడా]], [[అమెరికా]] దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది<ref name="economictimes.indiatimes.com">[http://economictimes.indiatimes.com/articleshow/1869114.cms Disney set to tell Chandamama stories]</ref>.చందమామను [[బి.నాగిరెడ్డి]] - [[చక్రపాణి]](వీరు తెలుగు, తమిళ బాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) [[1947]] జూలైలో ప్రారంభించారు <ref>{{cite news| url=http://www.thehindu.com/arts/cinema/a-true-karma-yogi/article4153840.ece | location=Chennai, India | work=The Hindu | first=B. Viswanatha | last=Reddi | title=A true karma yogi | date=1 December 2012}}</ref>. కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం , ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 - 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు. రామాయణ కల్పవృక్షం, [[వేయి పడగలు]] వంటి అద్భుత కావ్య రచనలు చేసి జ్ఞానపీఠ ప్రదానం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ [[విశ్వనాధ సత్యనారాయణ]] '''"చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా'''" అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థంచేసుకోవచ్చును.
[[దస్త్రం:Chandamama First Cover Page.jpg|right|thumb|100px|1947లో]]
 
"https://te.wikipedia.org/wiki/చందమామ" నుండి వెలికితీశారు