శివ (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 7:
production_company = [[అన్నపూర్ణ స్టూడియోs & ఎస్.ఎస్.క్రియెషన్స్ ]]|
music = [[ఇళయరాజా]]|
starring = [[అక్కినేని నాగార్జున ]],<br>[[రాంజగన్]],<br>[[అమల ]],<br>[[రఘువరన్]]|
}}
టైటిల్ రోల్ ని [[అక్కినేని నాగార్జున]] పోషించిన శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. [[అమల]] కథానాయికగా, [[రఘువరన్]] ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా [[తనికెళ్ళ భరణి]] నటించారు. భరణి కథ కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. [[ఇళయరాజా]] స్వరాలని కూర్చారు. [[రాంగోపాల్ వర్మ]]కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. [[తమిళం]] లో ఉదయం గా అనువదించబడగా, [[హిందీ]] లో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం [[సికింద్రాబాద్]] లోని కీస్ ఉన్నత పాఠశాలది.
పంక్తి 17:
ఇటువంటి కళాశాలలో శివ ([[అక్కినేని నాగార్జున]]) విద్యార్థిగా చేరతాడు. మల్లి ([[శుభలేఖ సుధాకర్]]), ఆశ([[అమల]])తో స్నేహం కలుగుతుంది. అమ్మాయిలను ఇబ్బంది పెట్టటం, అధ్యాపకులని అవమానపరచటం వంటి పనులతో అల్లరి చేస్తున్న జెడి కి శివ తారసపడతాడు. మొదటి సారి స్నేహితుల అభ్యర్థన మేరకు జెడిని క్షమించినా రెండవసారి శివని జెడి కవ్వించి రెచ్చగొట్టటంతో సైకిల్ చైనుతో జెడి, అతని అనుచరులపై తిరగబడతాడు. అంతేకాక కళాశాల ప్రాంగణంలోనే జెడి ని వెంబడించి అతనిని అతికిరాతకంగా శిక్షిస్తాడు. అదివరకూ ఎవరూ తనని ఎదిరించలేరన్న ధీమాతో ఉన్న జెడి శివ తెగింపుకి నిశ్చేష్టుడౌతాడు.
 
ఈ అనూహ్య సంఘటన మరో రెండు పర్యవసానాలకి దారి తీస్తుంది. మొదటిది జెడి గణేశ్ ని రంగంలోకి దింపగా, రెండవది స్నేహితులు శివని ఎన్నికలలో నిలబడటానికి ప్రోత్సహించటం. కానీ శివ అర్హుడైన తన సహచరుడు జగన్ ([[రాంజగన్]]) ని ఎన్నికల్లో నిలబెట్టమని కోరతాడు. గణేశ్ శివ ప్రయత్నాలని ఆపమని కోరతాడు. కానీ శివ తమ కళాశాల వ్యవహారాలలో వీధి రౌడీల జోక్యం అనవససరమని స్పష్టం చేస్తాడు.
 
గణేశ్ బెదిరించే ప్రయత్నం చేయటంతో శివ అతనికి కూడా దేహశుద్ధి చేయటంతో వ్యవహారం భవానీ దాకా వెళుతుంది. మొదట ఆగ్రహించినా తర్వాత శివలో భవానీ జెడికి ప్రత్యామ్నాయ శక్తిని గమనిస్తుంటాడు. భవానీ జగన్ ని హతమార్చగా శివ ఎన్నికల్లో నిలబడటానికి అంగీకరిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/శివ_(1989_సినిమా)" నుండి వెలికితీశారు