కొత్తపల్లి జయశంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
==బాల్యం==
[[1934]] , [[ఆగస్టు 6]] న [[వరంగల్‌ జిల్లా]] జిల్లా, [[ఆత్మకూరు]] మండలం [[అక్కంపేట]] లో జయశంకర్‌ జన్మించాడు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంత్‌రావు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. జయశంకర్‌ తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ [[బ్రహ్మచారి]] గా మిగిలిపోయాడు.
 
==ఉద్యోగ జీవితం==
బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో పీహెచ్‌డీ చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ లోని [[సీకేఎం కళాశాల]] ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు [[కాకతీయ విశ్వవిద్యాలయం]] రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/కొత్తపల్లి_జయశంకర్" నుండి వెలికితీశారు