ఎర్రకోట: కూర్పుల మధ్య తేడాలు

{{మొఘల్ సామ్రాజ్యం}}
పంక్తి 41:
ఎర్రకోట అత్యుత్తమ స్థాయి కళా రూపానికి మరియు అలంకారపు పనితీరుకి అద్దం పడుతుంది. ఈ కోటలో ప్రదర్శించబడిన కళారూపము ఐరోపా, పర్షియా మరియు భారత దేశాలకి చెందిన కళల యొక్క సంయోగము. ఈ కలయిక రూపము, భావవ్యక్తికరణం మరియు వర్ణములలో అత్యుత్తమంగా ఉండే షాజహాని శైలి అనే ఒక విలక్షణమైన అపూర్వమైన వాస్తుకళారూపం వికసించడానికి దారి తీసింది. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట, భారత దేశములో ఉన్న ముఖ్యమైన భవన సముదాయాలలో ఒకటి. ఈ కోట భారత దేశపు చిరకాల చరిత్ర మరియు కళలను తనలో ఇముడ్చుకున్నది. ఈ కోట యొక్క ప్రాముఖ్యత కాలానికి మరియు అంతరానికి అతీతంగా నిలుస్తంది. ఈ కట్టడము భవననిర్మాణ కళయొక్క శక్తికి, మేధస్సుకు చిహ్నంగా నిలుస్తుంది. 1913లో ఈ కోటని ఒక దేశీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడముగా ప్రకటించక ముందు నుండే ఎర్రకోటని భావితరాల వారికోసం కాపాడి నిక్షేపించడానికి ప్రయత్నాలు చేయబడ్డాయి.
 
కోట యొక్క గోడలు నున్నగా అలంకరించబడి, పై బాగాములో భారీగా తీగల అలంకారాలు కలిగి ఉన్నాయి. కోటకి రెండు ముఖ్యమైన ముఖద్వారాలు ఉన్నాయి. అవి ఢిల్లీ దర్వాజా మరియు [[లాహోర్]] దర్వాజ. లాహోర్ దర్వాజానే ప్రధాన ప్రవేశము; ఈ ద్వారం చట్టా చౌక్ అనే ఒక పొడుగైన కప్పబడిన బజార్ వీధికి దారి తీస్తుంది. ఈ వీధి గోడలకు ఆనుకుని దుకాణాల కోసం అంగడులు నిర్మించారు. చట్టా చౌక్ తరువాత ఒక విశాలమైన ఖాళి స్థలం ఉంటుంది. ఆ తరువాత, పెద్ద ఉత్తర-దక్షిణ వీధి వస్తుంది. ఈ వీధి పూర్వం కోటని సైన్య కార్యకలాపాలు పడమర వైపున, రాజభవనాలు తూర్పు వైపున ఉండే విధముగా రెండుగా విభజించేది. ఈ వీధి యొక్క దక్షిణము వైపు చివరలో ఢిల్లీ ద్వారం ఉంటుంది.
 
==కోట లోపల ఉన్న ముఖ్యమైన భవనాలు==
"https://te.wikipedia.org/wiki/ఎర్రకోట" నుండి వెలికితీశారు