2,16,436
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
===లంకెబిందెలు ===
===లంగూడి ===
===లక్క గేదె ===
===లకోటాప్రశ్న ===
===లబలబా===
లబలబా నోరు కొట్టు కుంటున్నారు.
===లావొక్కింతయు లేదు===
భలము పూర్తిగా నశించిందని అర్థం.
===లింగపోటు===
మెడలో శివలింగాన్ని ధరించిన జంగందేవర ఓ దొంగ కంటపడ్డాడు. ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి పరుగు లంకించుకుని ఇల్లు చేరాడు కానీ పరుగెత్తేటప్పుడు అతడి మెడలో ఉన్న శివలింగం అటూ ఇటూ ఊగుతూ డొక్కల్లో పొడుచుకుని పోటు పెట్టిందట.[[దొంగపోటు కంటే లింగపోటు ఎక్కువ ]] య్యిందని ఆ [[జంగం]] పరుగెత్తుతూ అనుకుంటాడు.
===లింగంమీది ఎలుక ===
===లుబ్ధావధానులు ===
===లెక్కతీరిపోవడం===
మరణించడం . మనిషిగా పుట్టిన తరువాత ఈ లోకంలో చేయాల్సినవన్నీ దేవుడి ఆజ్ఞ మేరకు చేసినట్లు, ఆయన లెక్కకట్టిన విధంగా జీవించాల్సిన రోజులు గడిచిపోయాక మరణం ప్రాప్తిస్తుందనే భావన
===లెక్క లేదు===
ఖాతరు చేయడము లేదు.... ఉదా: నేనంటే వానికి లెక్కేలేదు.
===లెక్క మీద సున్నా===
వాడికంటూ ఏమీ లేదు అంతా ఇతరులదే.ఇతరుల మీద ఆధారపడి పని చేసేవాడు, అస్వతంత్రుడు, నిష్ప్రయోజకుడు. అంకె మీద ఆధారపడి మాత్రమే సున్నా తన విలువను పెంచుకొంటుంది.
===లేనిపోని తలనొప్పి===
అనవసర ఇబ్బందులు . తలనొప్పిని ఎవరూ కావాలని తెచ్చుకోరు. ఇబ్బందులను, అడ్డంకులను కోరి మరీ తెచ్చుకున్నట్టుగా ఎవరైనా ప్రవర్తించిన సందర్భం
===లేమి లేవనివ్వదు===
పేదరికం అభివృద్ధికి ఆటంకం ,ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా ఎంతో కొంత సంపదలు కలిగి ఉండాలన్న భావన
===లేవనెత్తడం===▼
ప్రస్తావించడం ,కిందపడిన దేన్నైనా పైకి ఎత్తడం ,పదిమంది మధ్యలో ఉన్నప్పుడు అందరికీ తెలిసేలా చెప్పడం ▼
===లేవదీయటం===
లేవనెత్తటం , విషయ ప్రస్తావన ,ప్రశ్నలను లేవదీయటం, సమస్యలను లేవనెత్తటం . చర్చలో అప్పటివరకు అక్కడ లేని సమస్యలను సృష్టించి ప్రస్తావించటం
▲===లేవనెత్తడం===
▲ప్రస్తావించడం ,కిందపడిన దేన్నైనా పైకి ఎత్తడం ,పదిమంది మధ్యలో ఉన్నప్పుడు అందరికీ తెలిసేలా చెప్పడం
===లైట్ తీస్కో===
పట్టించు కోకు. ఉదా: వాని మాట్లను లైట్ తీస్కో.
===లొట్టలేయడం===
బాగా ఆనందించడం .మనసుకు నచ్చిన, రుచికరమైన పదార్ధాలను, విషయాలను చూస్తున్నప్పుడు అసంకల్పితంగానే నోట్లో లాలాజలం ఊరడం, లొట్టలేసుకుంటూ తినటం .
===లొట్టా భట్టీయం ===
===లొడలొడ===
పటుత్వం రహితం, వదులుగా ఉండటం, == ఎక్కువగా మాట్లాడె వాళ్లను గురించి ఈ మాటను వాడతారు. ఉదా: వాడు లొడ లొడ వాగు తున్నాడు.
===లోకం తెలియనివాడు===
అమాయకుడు .
===లోడు మీదుండటం===
లారీ మీద ఎక్కువ లోడు ఉండటం చేత భారంగా కదలాల్సివస్తోంది.మద్యపానం చేసిన వ్యక్తి కూడా బరువుగా కదులుతూ వస్తున్నట్టు కనిపిస్తాడు. వాడు లోడు మీదున్నాడు, వాడితో నీకెందుకు తప్పుకో' అంటారు
===లోతైన మనిషి===
అన్ని అంతరంగంలో దాచుకునే వాడు: ఉదా: వాడు లోతైన మనిషి. ఎవ్వరికి అర్థం కాడు.
|
edits