తాడిపత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇవి కూడా చూడండి: {{commonscat|Tadipatri}}
పంక్తి 13:
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==తాడిపత్రి పురపాలిక సంఘము==
*తాడిపత్రి పురపాలక సంఘం కార్యాలయం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. కార్పొరేట్ కార్యాలయం తరహాలో సెంట్రల్ ఏసీతో నిర్మించారు. దీన్ని చూసినవారు ఇది ప్రభుత్వ కార్యాలయమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దారు. వీధుల్లో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నారు.
*2006లో తాడిపత్రి పురపాలక సంఘం పాలకవర్గం తాడిపత్రిలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించింది. దశలవారీగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాలకవర్గ కృషితో నేడు ప్లాస్టిక్ కవర్ల వినియోగం వందశాతం తగ్గింది. ఇంటర్ పాఠ్యాంశాల్లోనూ తాడిపత్రిలో ప్లాస్టిక్ నిషేధం గురించి చేర్చారు.
*తాడిపత్రిలో భూగర్భ డ్రైనేజీ పథకం అమలు అవుతోంది. అయితే పట్టణంలో 25444 నివాస గృహాలు ఉండగా 13వేల ఇళ్లకు భూగర్భ డ్రైనేజీ పథకం అనుసంధానం కాగా ఇంకా మిగిలిన ఇళ్లను పూర్తి చేయడానికి పురపాలక సంఘం కృషి చేస్తోంది. ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
*మామూలుగా అరటి, మామిడి వంటి పండ్లను క్యాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టేవారు. ప్రజారోగ్యం దృష్ట్యా తాడిపత్రిలో ఆధునిక పద్ధతిలో రైఫలింగ్ చాంబర్‌ను ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన ఇథిలిన్ గ్యాస్‌తో మాగబెడుతున్నారు.
*పట్టణంలో సుమారు 5వేల మంది విద్యార్థులకు ఒకేచోట పరిశుభ్రమైన ప్రదేశంలో స్టీమ్ సిస్టం ద్వారా మధ్యాహ్న భోజనం తయారు చేసి మెనూతోపాటు పెరగన్నం ఇస్తున్నారు.
*పట్టణంలో వీధి కుక్కలకు యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేయించారు. అలాగే వీధి కుక్కలకు గొట్టూరు జీవాశ్రమం సహకారంతో కు.ని. శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు.
*చెత్తను తడి, పొడి చెత్తగా విభజిస్తున్నారు. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేయగా పొడి చెత్తను మార్కెట్‌లో విక్రయించి మున్సిపాలిటీకి ఆదాయ వనరుగా మార్చుకొంటున్నారు.
*లార్వా నియంత్రించే గంబూషియా చేపల కోసం మత్స్యశాఖపై ఆధార పడకుండా గంబూషియా చేపలను ఉత్పత్తి చేసుకోవడంతో నియోజవకవర్గంలోని ఇతర ప్రాంతాలకు కూడా వీటిని అందించేందుకు సిద్ధం చేశారు.
*సుందర నగరంగా మార్చే క్రమంలోనే పట్టణం నుంచి పందుల తరలింపు కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి పందులను పట్టే వారిని రప్పించి పట్టణంలో పందుల స్వైర్య విహారం లేకుండా చేయడానికి ప్రణాళికలు తయారు చేసుకొన్నారు. వీధి ఆవులను పట్టి ఆశ్రమాలకు తరలించారు. వీధుల్లో తిరిగే ఆవులను పట్టి ఆశ్రమాలకు తరలిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు .
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
"https://te.wikipedia.org/wiki/తాడిపత్రి" నుండి వెలికితీశారు