"ఇన్స్టంట్ కెమెరా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
==పోలరాయిడ్ కెమెరా పని చేసే విధానం==
పోలరాయిడ్ కెమెరాలో డబుల్ పిక్చర్ రోల్ లోడ్ చేసి ఉంటుంది, వీటిలో ఒకటి నెగటివ్, మరొకటి ప్రత్యేకమైన కాగితంపై ఉండే పాజిటివ్ రోల్. పాజిటివ్ రోల్ మీద కొన్ని రసాయనిక పూతలు పూయబడి ఉంటాయి. ఫొటో తీసినప్పుడు కెమెరా లెన్స్ నుంచి కాంతినందుకున్న నెగటివ్, పాజిటివ్ రోల్స్ రెండూ రసాయనపు పొరలను ఛేదించుకుంటూ ఒక రోలర్ గుండా బయటికి వస్తాయి. అప్పటికే ఎక్స్‌పోజ్ అయి ఉన్న నెగటివ్ రోల్ నుంచి రసాయన పూతలు చొచ్చుకుపోయి నెగటివ్ రోల్ పైన నలుపు, తెలుపు రంగులతో కూడిన నెగటివ్ ఇమేజ్ ఏర్పడుతుంది. పాజిటివ్ రోల్‌కూ, కెమెరాలో ఉన్న రసాయనాలకు మధ్య జరిగిన చర్య ఫలితంగా ఫొటోగ్రాఫ్ పైన గల తెలుపు బొమ్మ తెల్లగానూ, నలుపు బొమ్మ నల్లగానూ ఉండేలా చిత్రం ఆవిష్కృతమవుతుంది. [[బ్లాక్ అండ్ వైట్]] చిత్రం ఆవిష్కృతమవడానికి 10 సెకండ్లు మాత్రమే పడితే, రంగుల చిత్రం ఆవిష్కృతమవడానికి నిమిషం దాకా వ్యవధి పడుతుంది. ఫిల్మ్‌ను లైట్‌లో ఎక్స్‌పోజ్ చేసినప్పుడు దాని మీద ఉండే సిల్వర్ సాల్ట్, మెటాలిక్ సిల్వర్‌గా మారిపోతుంది. ఫోటో తీసినప్పుడు జరిగే ఒక రసాయన చర్య వలన ఫిల్మ్‌పైన రంగులు ఏర్పడతాయి. ఇలా తొలిదశ పోలరాయిడ్ కెమెరాల పనితీరు ఉండగా, ఆ తరువాత 1972లో, 1978లో జరిగిన సాంకేతికాభివృద్ధి ఫలితంగా వీటి పనితీరు బాగా మెరుగయింది.
 
 
==ఇవి కూడా చూడండి==
32,624

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1282875" నుండి వెలికితీశారు