కందుకూరి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
# ఆంధ్రసారస్వత సమితి పురస్కారం
# కాకతీయ యూనివర్సిటీ పురస్కారం
 
==రచనలనుండి ఉదాహరణ==
:: '''గగనకళ'''
 
::చూపుండాలిగాని
::ఏ దిక్కు చూసినా అందం ఆనందం
::ఈ ఆకాశం
::నవరసాల సువిశాల స్వతంత్ర సుక్షేత్రం
::అందుకుందామంటే అందదు
::అణగదొక్కుదామంటే కుంగదు
::భూగోళం గుడిసె ముందట
::ముగ్గులలో మురిపెంగా
::తీర్చిదిద్దిన వాకిలి ఈ ఆకాశం
::చిన్నపిల్లలై వ్యోమగాములు
::మూడుచక్రాల బండ్ల రాకెట్లెక్కి
::ఈ మూల నుండి ఆ మూలకు
::ఆ మూల నుండి ఈ మూలకు
::పోటీపడి ఆదుకోవచ్చు పాడుకోవచ్చు
::ఎన్ని మార్గాల్లోనైనా విహరించవచ్చు
::ఎన్ని ప్రయోగాలైనా చేసుకోవచ్చు
::నక్షత్రాలన్ని గాలించి రావటం
::గ్రహాలన్నిశోధించి రావటం
::మహాప్రస్థాన యాత్రాస్థలం ఈ నీలాకాశం
::ఎన్నో పరిణామాల యుద్ధ విమానాల
::అతి పెద్ద రంగస్థల ప్రవేశం ఈ నింగి
::వేదికనధిష్టించిన
::వీరుల కదలికలు చంద్రవంకలు
::భూమ్మీద నుండి చూస్తే
::బోర్లించిన కోళ్లగంప ఈ దివి
::గంప కింద ఎరుపుజుట్టుల
::కొక్కోరోకోలు ఉభయసంధ్యలు
::తేజస్సు మేధస్సుతో
::రెప్పార్పని కన్ను ఈ మున్ను
::సంగ్రామ రంగంలో రంగుల విల్లు సంధిస్తున్న
::నైపుణ్య బాణాల చినుకులు
::పడమర నుండి బయల్దేరితే
::తూర్పు దాకా
::దక్షణం నుండి దండయాత్ర చేస్తే
::ఉత్తరం దాకా
::దట్టమైన చీకట్ల పదఘట్టనల
::కోట్ల చెట్ల విజృంభణల
::భయంకరారణ్యం ఈ గగనం
::ఎన్నో అలల సుడుగాలుల
::తుఫాన్ భీభత్సాల
::మహూద్రేక మహా సముద్రం
::చకచక మెరుపుల ఉరుముల
::ఫెళఫెళార్భాట పిడుగుల
::రుద్రరూప భీతావహ జ్వాలాజ్వలితం
::సూర్యునంత ఎత్తు
::కనిపించని కట్టెకొసకు
::రెపరెపలాడుతున్న జెండా
::ఎన్నో కోణాల్తో
::ఎన్నెన్నో ఇతివృత్తాలతో
::తెల్లకాగితంమ్మీద గీసిన వృత్తం
::పుట్టినాక బతకడానికి
::గుడిసె కూడా లేనివాని ఇంటి పైకప్పు
::భయానికి భూమంతా కదిలిపోతుంటే
::ఒక్కసారి పైకి చూడు
::నేనున్నానని తండ్రిలా
::వెన్నుతట్టుతున్న గుండె ధైర్యం
::గాలంతా విశాలం ఈ ఆకాశం
::త్యాగాల తంత్రుల మీద
::పోరాటాల రాగలు తీస్తుంది
::విలయతాండవం చేయడానికి
::కైలాస శిఖర సభలో కొలువుదీరిన
::బుద్దిజీవులు చుక్కలు
::జీవగంజి పోయడానికి
::ఆవిరితట్టలు మోసుకు తిరుగుతున్న
::కావడి బతుకులు మేఘాలు
::ఆ దిక్కు సూర్యగోళం
::ధగధగమంటుంది
::ఈ దిక్కు చంద్రబింబం
::నవనవలాడుతుంది
::అందం ఆకాశం
::వెచ్చని తూర్పు వెలుతురులో
::ఒళ్ళంతా హొయలు గొలుపుతుంది
::ఆనందం ఆకాశం
::తెల్లని మబ్బుల బెలూన్లతో
::ఇల్లంతా పండగ చేసుకుంటుంది