"ఉదయకిరణ్ (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
ఒంటి గంట ప్రాంతంలో శ్రీనగర్‌కాలనీలోని ప్లాట్‌కు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం, ఉదయ్ అంటూ పిలిచినా పలకకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసుకుని లోపలకు వెళ్లారు. లోపల నుంచి మూసి ఉన్న వ్యాయామశాల తలుపు ఎంతకూ తెరుచుకోకపోవడంతో వాచ్‌మన్లు మరికొందరితో కలసి బలవంతంగా తెరిచారు. అక్కడ ఉరివేసుకుని ఉదయ్ కిరణ్ కనిపించడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఉరి వేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు. కొనప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆస్పత్రి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2014-01-07/hyderabad/45954141_1_suicide-note-banjara-hills-vishitha |title=Actor Uday Kiran commits suicide |publisher=TimesOfIndia |date= 2014-1-07|accessdate=2014-01-13}}</ref>
===శవ పంచనామా===
సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది. ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించారని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది. మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు మద్యం సేవించారని నివేదికలో వెల్లడైంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యను పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు అందకపోవడంతో చార్జిషీట్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించారని నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. జనవరి 5 తేదిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ మృతి అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.<ref>http://www.thehindu.com/news/cities/Hyderabad/uday-kirans-death-evidence-points-to-suicide/article5550132.ece</ref>
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1283836" నుండి వెలికితీశారు