కె.శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
* విశాల అవార్డు
* కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం -1990 లో మోహనా! ఓ మోహనా! కవితా సంకలనానికి.
 
==రచనల నుండి మచ్చుతునక==
:: '''ఆమెకలదు'''
::ఏం చేస్తావు ఆమెని
::ఎత్తుకోగలవా, చేతుల్లో పెట్టుకు లాలించగలవా
::నీ రెండు కళ్లను పీకి
::ఆమె అరచేతుల్లో పెట్టగలవా
::ఎన్నో జన్మల నుంచి నడుస్తున్న
::ఆమె కాళ్ల కింద యింత దుమ్ము అవగలవా
::ఏం చేస్తావు ఆమెని
::నాలుక చివరతో ఆమె కంట్లోని నలకను తీయగలవా
::గుండెలో విరిగిన ముల్లును
::మునిపంటితో బయటికి లాగగలవా
::భూమిపొరల్లో ఖనిజంగా ఉన్న
::ఆమెను తవ్వి తలకెత్తుకోగలవా
::చిన్నపిల్లలా భుజానెక్కించుకుని
::విశ్వమంతా ఊరేగించగలవా
::ఏం చేయగలవు నువ్వు
::చెదిరిన ముఖంగలవాడివి
::చీలిన నాలుకలవాడివి
::తలాతోకా తెలియని
::మొండెపుతనంతో ఊరేగుతున్నవాడివి
::రహస్య సంకేతాల కేంద్రమయిన ఆమెను
::ఛేదించగలవా చదవగలవా
::చిరుమువ్వల పువ్వులు ధరించి
::తిరుగుతున్న ఆమెను వినగలవా
::వీనులతో చూడగలవా
::ఆమెనేం చేయగలవు
:: ‘అడవి ఉప్పొంగిన రాత్రి’లాంటి ఆమెను
::అందుకోగలవా అనువదించగలవా
::ఆరుబయట వెన్నెట్లో
::అమోఘంగా చలించే ఆమెను
::తాకగలవా, తాకి తరించగలవా -
::ఆమె ముందొక శిశువై
::దిగంబరంగా నర్తించగలవా
::ఆమె గుండెల్లో తల పెట్టుకుని దుఃఖించగలవా
::ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి సేదదీరగలవా
::నీ అస్తిత్వాన్ని మర్చిపోయి
::ఆమె అస్తిత్వాన్ని గుర్తించగలవా
::ఏం చేయగలవు
::ఏం చేయలేని వెర్రిబాగులాడా
::వెదకటం తెలియాలిరా
::మనుషుల్లో మనుషుల్ని వెదకటం తెలియాలిరా
::నీలో నువ్వు కొట్టుకుపోతున్న నిన్ను
::ఆమె రక్షించగలదు
::ఆమె కలదు, నువ్వు లేవు.
:::: ('''ఆమె ఎవరైతే మాత్రం''' కవితా సంకలనం నుండి)
"https://te.wikipedia.org/wiki/కె.శివారెడ్డి" నుండి వెలికితీశారు