"దాగుడు మూతలు (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సినీమాల్లోకి రావడం ముళ్ళపూడికి మొదట ఇష్టం లేకున్నా డి.బి.ఎన్ కు ఎదురు చెప్పలేక 'దాగుడు మూతలు' సినిమాకు కథ అల్లారు. పూర్తి స్క్రిప్టు తయారైతే కానీ షూటింగు షెడ్యూలు మొదలు పెట్టించే అలవాటులేని ముళ్ళపూడి, ఈ సినిమా కోసం గ్యారీ కూపర్, జీన్ ఆర్థర్ నటించిన 'డాక్టర్ డీడ్స్ గోస్ టు టౌన్' అనే అమెరికన్ స్క్రూ బాల్ కామెడీ సినిమాని ప్రేరణగా తీసుకొని కథ అల్లి సినేరియా సమకూర్చారు. ఈ హాలీవుడ్ సినిమాకి ఆధారమైన 'ఒపెరా హ్యాట్' అనే కథే దాగుడు మూతలు సినిమాకి కూడా మూలం. ఇంచుమించు దాగుడుమూతలు సినిమాకూడా అదే ధోరణిలో సాగుతుంది. దాగుడుమూతలు ముళ్ళపూడికి మొదటి సినిమానే అయినా, తొలుత విడుదలైన సినిమా మాత్రం 'రక్తసంబంధం' సినిమానే. ఇక దాగుడుమూతలు కథలోకి వెళ్తే, కోటీశ్వరుడు విశ్వసుందరరావు (గుమ్మడి) తన అభీష్టాన్ని వ్యతిరేకించి పెళ్లిచేసుకున్నందుకు కొడుకును ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. తనకి మనిషి విలువేమిటో తెలిసేసరికి కొడుకూ, కోడలూ చనిపోతారు. అనాధగా మిగిలిన మనవడిని దారినపోయే దానయ్య చేరదీసి పెంచుతాడు. మనవడికోసం దేశమంతా గాలించినా అతని ఆచూకీ తెలియదు. కానీ తనవూళ్ళోనే, తన మిల్లు ప్రాంగణంలోనే చిన్న హోటలు నడుపుకునే సుందరయ్య తన మనవడేనని తెలుసుకోలేకపోతాడు జమీందారు. తనను పెంచిన దానయ్య బిడ్డల్ని సాకుతూ, పదిమందికీ సహాయపడుతూ హోటలు నడిపే సుందరయ్య జీవితంలోకి ఇష్టంలేని పెళ్లినుంచి తప్పించుకుని పారిపోయివచ్చిన సుబ్బులు (బి.సరోజాదేవి) అనే చిన్నది ప్రవేశిస్తుంది. వారిద్దరి మనసులు కలిసి ప్రేమ చిగురిస్తుంది. జమీందారు ఆస్తి దక్కించుకోవాలని ఆయన అన్న అల్లుడు భూషణం (రమణారెడ్డి) తన కూతురు (శారద)తోనూ, జమీందారు తమ్ముని కోడలు సూరమ్మ (సూర్యకాంతం) తన కొడుకు (పద్మనాభం)తోనూ ఆ బంగళాలో తిష్టవేసి పోటీలుపడి సేవల పేరుతో జమీందారుని హింసిస్తూ వుంటారు. సుబ్బులు జమీందారు దివాణంలో సేవలుచేసి నర్సుగా చేరి, జమీందారు అభిమానం చూరగొని, ఆ బంగళాలో సెక్రెటరీ స్థాయికి ఎదిగి ఆ ఇంట్లో అధికారం సంపాదించుకుంటుంది. ''నా కూతుర్ని నీ కోడలుగా చేసుకో: నీ కొడుకుని నేను జమీందారుకు దత్తు చేయిస్తాను'' అని భూషణం సూరమ్మతో చెప్పి, జమీందారును దత్తతకు ఒప్పిస్తాడు. జమీందారు వద్దవున్న ఫోటో, సుందరయ్యవద్ద వున్న అతని తల్లిదండ్రుల ఫోటో ఒక్కలాగే వుండడం గమనించిన సుబ్బులు సుందరయ్యే జమీందారు మనవడని గ్రహించి ఆయనకు సుందరయ్యను అప్పగిస్తుంది. సుందరయ్యను వారసుడిగా ప్రకటించి జమీందారు కన్నుమూస్తాడు. సుందరయ్య దానధర్మాలు చేస్తూవుండటం మింగుడుపడని భూషణం. తన కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందని ఒక దొంగ వీలునామా సృష్టించి వలపన్నుతాడు. సుందరయ్య భూషణం పన్నాగాన్ని పసికట్టి ఎత్తుకు పైఎత్తు వేసి శారదతో కూడపలుక్కొని పెళ్లి చేసుకునేందుకు సరేనంటాడు. ఈ నాటకం తెలియని సుబ్బులు సుందర య్యను అపార్ధం చేసుకొని వెళ్ళిపోతుంది. బంగాళాకు వచ్చిన సుందరయ్య అక్కడ చేస్తున్న పెళ్లి ఏర్పాట్లను చూసి రెచ్చిపోయి ఆ ఏర్పాట్లను తన్నివేసి, అడ్డొచ్చిన వాళ్ళను తోసివేస్తాడు. దాంతో అతనికి పిచ్చెక్కిందని ప్రకటించి భూషణం సుందరయ్యను పిచ్చాసుపత్రిలో చేరుస్తాడు. అసలు విషయం తెలుసుకొన్న సుబ్బులు సహాయంతో, భూషణం, సూరమ్మల డబ్బు పిచ్చి వదిలించి సుందరయ్య సుబ్బుల్ని పెళ్ళాడటంతో సినిమాకి శుభం. కాదు కాదు 'జైహింద్' కార్డు పడుతుంది.
 
==దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మార్కు కథనం==
ఆదుర్తి సుబ్బారావు సినిమాను నడిపే పద్ధతి విలక్షణంగా వుంటుంది. ఆదుర్తి గొప్పతనం ఆయన తీర్చిదిద్దిన శిష్యుల పనితనంలో బయటపడుతుందనే మాట సత్యం. విక్టరీ మధుసూదనరావు, కళాతపస్వి విశ్వనాధ్, ఎడిటర్-డైరెక్టర్ టి.కృష్ణలు ఆదుర్తి స్కూలునుంచి వచ్చినవారే! ముళ్ళపూడి వెంకటరమణతోబాటు రచయిత సత్యానంద్ కు ఓనమాలు దిద్దించిందీ; సెల్వరాజ్ ని ఛాయాగ్రాహకుడిగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఆదుర్తిదే. సాధారణంగా సౌండ్ ట్రాక్ చెకింగ్ కి మూవియోలా మీద ఫిలిం నడపటం అందరూ అనుసరించే పద్ధతి. కానీ ఆదుర్తి మాత్రం ఫిలిం రీలుని కిటికీ వెలుతురులో చేత్తో తిప్పి సౌండ్ ట్రాక్ ఎక్కడ ఆగిందో చెప్పేవారు. పంటి బిగువున ఫిలిం ముక్కను అక్కడ తెంపి అతికించేవాడు. కచ్చితంగా శబ్దం సరిపోయేది. దాగుడుమూతలు సినిమా నిర్మాణం మాత్రం ఎందుకో చకచకా సాగలేదు. ఈ సినిమా రచన సాగుతున్న కాలంలోనే 'మూగమనసులు' సినిమాకి ముళ్ళపూడిని ట్రీట్మెంట్ రాయమన్నారు ఆదుర్తి. పాపం డి.బి.ఎన్ యేమీ అనేవాడు కాదు. ఈ సినిమా రచనాకాలంలో ముళ్ళపూడి పుచ్చుకున్న నెలజీతం నాలుగువేలు! అప్పట్లో అదే పెద్ద పారితోషికం కింద లెక్క. చివరకు వాహిని-విజయా స్టూడియోలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా నడిచిపోతుంది. అతితక్కువ డైలాగులతో ఎక్కడా విసుగు రానీయని రీతిలో చిత్రాన్ని నడిపించారు ఆదుర్తి. కొందరు అస్మదీయులైతే కావాలనే చిత్రనిర్మాణాన్ని ఆదుర్తి ఆలస్యం చేస్తున్నారనీ, అక్కినేని చిత్రాలు తీయడంలో వున్న శ్రద్ధ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం మీద ఆదుర్తికి లేదని విమర్శలు గుప్పించారు. ఆదుర్తి వాటిని పట్టించుకోలేదు. రమణారెడ్డిని కామెడీ విలన్ గా, నాగయ్యను పోలీసు అధికారిగా చక్కగా వాడుకున్నారు. 'పెండ్లిపిలుపు' (1961) సినిమా విడుదలైన మూడేళ్ళకుగానీ దాగుడుమూతలు రిలీజు కాలేదంటే యెంత నిర్మాణజాప్యం జరిగిందో బోధపడుతుంది. విచిత్రమేమిటంటే, 'డాక్టర్ డీడ్స్ గోస్ టు టౌన్' సినిమా తయారీ కూడా ఇలాగే ఆలస్యమేకావటం కొసమెరుపు!
== పాటలు ==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1284683" నుండి వెలికితీశారు