"ఐస్ బకెట్ ఛాలెంజ్" కూర్పుల మధ్య తేడాలు

[[మసాచుసెట్స్]] లోని నాంటుకెట్ సముద్ర తీరంలో ఆగస్టు 16న జరిగిన డైవింగ్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. డైవింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి మునిపోయారు.27 ఏళ్ల వయసులోనే గిఫ్రిన్ మృతి చెందడం విచారకరం. చనిపోవడానికి ముందు వరకు అతడు లక్ష డాలర్ల విరాళాలు సేకరించడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గిఫ్రిన్ ను ఆయన తండ్రి రాబర్ట్ వర్ణించారు. 'గత రాత్రి ఫోన్ చేసి తాను స్వర్గంలో ఉన్నట్టు గిఫ్రిన్ చెప్పాడు' అని సంతాప సందేశంలో ఆయన పేర్కొన్నారు.
 
==ప్రపంచవ్యాప్తంగా ఈ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖులు==
[[డేవిడ్ బెక్‌హామ్]], [[సత్య నాదెళ్ల]], [[బిల్‌గేట్స్]].. [[క్రిస్టియానో రొనాల్డొ]], [[జస్టిన్ టింబర్లేక్]], [[జిమ్మీ ఫాలన్]].. ఇలా చాలామంది సెలబ్రిటీలు ఐస్ బక్కెట్‌కి సై అన్నారు.
==మనదేశంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖులు==
బాలీవుడ్ నుంచి అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బిపాసా బసు, అభిషేక్ బచ్చన్, సోనాక్షి సిన్హా.. వంటివారంతా సై సై అన్నారు. ఈ ఎఎల్‌ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్‌ను [[హైదరాబాద్]] నగరానికి తీసుకొచ్చిన తొలి టాలీవుడ్ సెలబ్రిటీ [[హన్సికా మోట్వాని|హన్సిక మోత్వాని]].తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యాన్స్‌ను కూడా చాలెంజ్‌కు నామినేట్ చేసింది. ఆమెతో పాటు [[సానియా మీర్జా]], బ్యాడ్మింటన్ క్రీడాకారిణి [[గుత్తా జ్వాల]], సినీ హీరో [[హర్షవర్ధన్ రాణే]], [[నితిన్ రెడ్డి]], ఉజ్వల్ భల్లా తదితర సెలబ్రిటీలు చాలెంజ్‌లు అందుకోవడమే ఆలస్యం.. బకెట్‌లతో ఐస్‌నీళ్లను నెత్తి మీద కుమ్మరించుకుంటూ యూ ట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేస్తున్నారు. హర్షవర్ధన్ రాణేను గుత్తా జ్వాల చాలెంజ్ చేస్తే.. రంగం ఫేమ్ [[కార్తీక]]ను, [[దగ్గుబాటి రాణా]] తదితరులను హర్ష చాలెంజ్ చేశాడు
===[[సోనాక్షి సిన్హా]]===
బాలీవుడ్ హీరోయిన్ [[సోనాక్షి సిన్హా]] ఓ సరికొత్త పద్ధతిలో ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించింది.ఎవరూ తనను ఛాలెంజ్ చేయకపోయినా తనంతట తానే ఇందులో పాల్గొంది. ఈ తరహా ఛాలెంజ్ పేరుతో నీళ్లు వృథా చేయడం తనకు ఇష్టం లేదని అంటూ.. బకెట్ లో కేవలం ఒకే ఒక్క ఐస్ క్యూబ్ వేసుకుని, దాన్ని తన తలమీద నుంచి కిందకు వేసుకుంది. అనవసరంగా నీళ్లు వృథా చేయడం మాని ముందు ఆ సైట్ లోకి వెళ్లి విరాళాలు ఇవ్వాలని అభిమానులను కోరింది. ఈ మేరకు [[ఫేస్‌బుక్]] లో తన వీడియోను కూడా పోస్ట్ చేసింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1285099" నుండి వెలికితీశారు