కోణార్క సూర్య దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61:
 
 
'''కోణార్క సూర్యదేవాలయం''', 13వ శతాబ్దానికి చెందిన [[సూర్యుడు|సూర్య]] దేవాలయం, [[ఒరిస్సా]] ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. గంగావంశానికి చెందిన [[లాంగులా నరసింహదేవ I]] (క్రీ.శ. 1236-1264) లో నిర్మించాడు. ఈ రాజా లాంగులా నరసింహదేవుడు రాజా అనంగభీముని కుమారుడు. సూర్య భక్తుడు. ఈ మందిరము ఎత్తు 230 అడుగులు. ఈ నిర్మాణమునకు విచిత్రమైన పౌరాణిక కధకూడా ఉంది. దీనినే '''మైత్రేయవన''' మనిఅందురు. ఉత్కళమ్లోఉత్కళంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది. అదెట్లనగా: శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు ఒకనాడు నీళ్ళరేవులో అభ్యంజన స్త్నానం చేస్తున్న స్త్రీలను చూసాడని తండ్రి అతడిని శాపించినాడట. తండ్రిశాపం వల్ల సాంబుడు కుష్టురోగి పీడితుడై ఈ మైత్రేయవనంలో చద్రభాగాతీరాన సూర్యారాధనచేసి రోగవిముక్తుడయ్యడట. ఆపవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈమందిరాన్ని కట్టించాడట. మరొక విచిత్రం పద్మ పురాణంలో ఉంది. స్వయం సూర్యభగవానుడే ఇచ్చట తపస్సు చేసాడనీ, అందుకే ఈమందిరానికి పవిత్రత కలిగినదట. [[ఒరిస్సా]] లోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం ([[పూరి]]), చక్రక్షేత్రం ([[భువనేశ్వరం]]), గదాక్షేత్రం ([[జాజ్ పూర్]]), ఈ పద్మక్షేత్రం ప్రస్సిధమైనవి.ఈ క్షేత్రం హిందువులకేకాదు, మహమ్మదీయులకుకూడా పుణ్యక్షేత్రమే. ఇచ్చోటనే భక్త [[కబీరుదాసు]] సమాధి ఉండెనని [[అబుల్ఫజల్]] యొక్క [[అయినీ అక్బరీ]] చెప్పుతోంది.
దీనికి ''నల్ల పగోడా'' అనికూడా అంటారు.దీనిని [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]] గా ప్రకటించారు.
 
==మందిర వర్ణన==
ఈ దేవాలయం, మొగసాల (An entrance hall)- రెండూనూ పీఠంపైన రధమ్లాగూ చెక్కిఉంది.పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్కచక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మొగసాలసమ్ముఖమ్లోమొగసాలసమ్ముఖంలో ఏడుగుర్రాలు. శాస్త్రోక్తంగా సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై
ప్రపచంచొట్టూ తిరుగుతున్నాడు.అవన్నె ఇప్పుడు అంతగాలేవు.ఒరిసా దేవాలయములు నాలుగురకాలు: రేఖ, భద్ర, ఖఖారా, గౌరీయ. ఈదేవాలయమును, పూరి భువనేశ్వరాలయాలును రేఖా దేవాలయములు. కోణార్కము ఐదు రధాలమందిరము.మందిరంధ్యభాగములో సుచారుకారు ఖచితమగు సింహాసనమొకటున్నది. దానిపైన సూర్యభగవానుడు.దేవాలయముతోపాటు మొగసాల ఒక తామరపూవు మీద చెక్కివున్నది.మొగసాలకు నాల్గువైపులా ద్వారాలు. ఎంతో చక్కగా లలితకళలాగు రాయిమీద సుత్తిపెట్టిచెక్కివున్నది. ఆశ్రేణీలు, తామరపువ్వులు, లతలు అవన్నీ చూస్తే రమ్యముగా ఉండును.మొగసాలమ్ముఖాన మోరొక స్వతంత్రపీఠం మీద "నాట్యమందిరం" నిర్మింపబడిఉన్నది.దీనిని కొందరు భొగమటపమని, మరికొదరు నాట్యమందిరమని అంటారు. ఎచటా అశ్లీలాలు లేవు.అన్నివైపులా నర్తకులు భాజభజంత్రీలతో దేవార్చంబచేయటం కనబడుతోంది. ఆభంగిమలు ఈనాటి భరతనాట్యకళా ప్రదర్శకులు అనుకరించటానికి ఎంతో అనుకూలమని చెప్పవచ్చును. అంతేకాదు ఈ నాట్యమందిరము తామరపువ్వులతో నిండి ఉన్నది. దేవార్చనకు, భూషణానికి ప్రచీనులు ఈపువ్వులనే వాడేవారు.
 
ఈనాట్యమందిరందగ్గిరగా ఒక పెద్దబండరాయి క్రిందపడివున్నది. దానిమీద పెద్ద తామరపువ్వు చెక్కబడివున్నది. పూవు వ్యాసము 5 అడుగులు. పూదళాలు అప్సరసలు గానాభజానా చేస్తున్నత్లు కనిపిస్తారు. కేద్రమ్లోకేద్రంలో కూడా ఒక చిన్నపువ్వు. దీనిలో సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై కూర్చొని వున్నాడు. ఇరువైపులా పరిచారికలు. చేతుల్లో పువ్వులు. శిల్పి ఎంత సూక్షంగా, రసవంతంగా చెక్కినాడో! ఈరాయి నాట్యమందిరం యొక్క గర్భముద్ర చాని చెప్పుతారు.
 
మొగసాలకు ఉతారంవైపుగా ఉన్న రెండు ఏనుగు విగ్రహాలు ఉనాయి. అవి నిజం ఏనుగులా అన్నట్లు చెక్కినారు. ఏనుగు పొడవు 9 అడుగులు వెడల్పు 5 అడుగులు, ఎత్తు 9 అడుగులు.మొగసాలకు దక్షిణం వైపు విరాట్ స్వరూపంతో రెండు గుర్రాలుండేవి. ఇప్పుడవిలేవు. వాటి వీరావేశం, ఉన్మత్తభావాలను చూస్తే దర్సకులు భయపడేవారుట.వీటి పొడవు 10 అడుగులు, వెడల్పు 6 అడుగులు.
పంక్తి 80:
భోలాపాణి పాంయి గొలారె.
 
అంటె రాంచడి దుడుకుతనంతో తన్ను ద్వారమ్లోద్వారంలో కూర్చుండబెట్టి నీళ్ళకోసం నదికిపోయి తిరిగి రాలేదని విసుగుపడి ఈపద్యం రాసాడు.
 
ఇంకా ఇక్కడ నవగ్రహాలు ఇక్కడ చూడవలసినదవి. ఈగ్రహాలు మనుష్యాకారంలో ఝేఏవాఖాలాళూ చిమ్మేటట్లు మెరుస్తున్నాయి. తలలపై ముకుటం, పద్మాసనం వేసినట్లు చక్కబడినవి. ఇంకా ఎన్నో మూర్తులు కాలావస్తలో శిధిల పడినవి.ఈ మూర్తులన్నిటింకీ ముఖ్యమంది సూర్యప్రతిమ. ఈ సూర్యప్రతిమకు తలపై మకుటం, చెవుల్లో కుండలాలు, కంఠంలో హారం, మెడలో జెందెం, వాటిలో మువ్వలు, కటిప్రదేశమ్లోకటిప్రదేశంలో మేఖల, దానికింద గ్రంధిమాల- ఆ ఘటన మనోభావభంగిమలు ఎంతో స్వాభావికంగా జీవకళలు తొణికిసినట్లు కనిపిస్తోంది.ఈ ప్రతిమనుకూడా కొందరు బుద్ధదేవుని ప్రతిమ అని కొందరు భ్రమపడ్డారు.
ఈ పుణ్య క్షేత్రమ్లోక్షేత్రంలో మాఘ సప్తమినాడు గొప్పయాత్ర జరుగుతుంది. ఇంకా కొన్ని యాత్రలు పూర్వం వైభవంగా జరిగేవి. వీటిలో ముఖ్యమైనవి చైత్రయాత్ర, రధయాత్ర, చంద్రభాగాయాత్ర.
 
==మతభేదము==
ముఖ్యమైన విషయమేమనగా- ఈకోణార్కము బౌద్ధావశేషమా, కాదా? ఈ విషయంలో చాలా మంది చారిత్రుకులు తర్కించి తర్కించి ఎన్నో గ్రంధాలు వ్రాసారు. ఈచోటనే [[హ్యూయంసాంగ్]] యొక్క చెలితోలా లేకా చిత్రోత్పలా అనే బౌద్ధమత కేంద్రమొకటి ఉండేది. బౌద్ధయుంగమ్లోబౌద్ధయుంగంలో కళింగ రాజధాని '''దంతపురము''' ఈ చిత్రోత్పల పేరేనంటారు. హిందువులూ, బౌద్ధులూ గొప్ప స్నేహ భావంతో కలసిమెలసి ఉండెవారని హ్యూయంసాంగ్ చెప్పుతాడు. కోణార్కుకి మైత్రేయవనమని పద్మపురాణంలో వ్రాసివున్నది. బుద్ధదేవుని మారుపేరు మైత్రేయుడని, [[పాళీ]] భాషలో మైత్రేయుడని ఆక్షేత్రానికి అందుకోసమే మైత్రేయవనమని పేరువచ్చిందటారు. కోణార్కములో '''అర్కవటము (జిల్లేడు చెట్టు)''' ఉండేది. దానిక్రింద వటేశ్వరుడు కూడా నేటివరకు పూజింపబడుచున్నాడు. కపిలసంహితను బట్టి ఆచెట్టు క్రింద సూర్యభగవానుడె జపించాడని ప్రమాణం ఉంది. ఆస్థలాన్ని కొందరు బుద్ధిని బొధిద్రుమముండే దంటారు. ఆచెట్టు క్రిందనే బుద్ధదేవుడు 49 రోజులు తప్పస్సు చేసేడంటారు. కొందరు [[అమరకోశం] బట్టి బుద్ధుని మారుపేరు అర్కబధువని, దేవుని పేరును బట్టి స్థలం పేరు కోణార్కమైదని అంటారు. నరసింహదేవుని తామ్ర శాసనంలో ఈ స్థలానికి '''కోణా కోణా''' లేదా '''కోణాకమనము''' అని పేరుంది. బుద్ధదేవుని మరొకపేరు కోణాకమనీ, అందువల్లనే కోణార్కము బుద్ధదేవుని నామాంతరమగు స్థలమనీ అందురు. కోణార్కుకు అర్ధమేమంటే '''కోణ + అర్క = కోణార్క '''. పూరీక్షేత్రానికి (North-East) ఈశాన్య కోణంలోని అర్కదేవుని క్షేత్రం గనుక దీనికి కోణార్కమని పేరు. ఇలా చాలా విషయాల్లో కోణర్కమునకు బౌద్ధులకు సంబంధమును కలదు.
 
==నిర్మాణకౌశలము==