భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
తమ కాలనీలోని మిత్రులను ఒకచోట చేర్చి తానే నాటకాలు రూపొందించి వినాయకచవితి మండపాల్లో వాటిని ప్రదర్శించడం ప్రారంభించారు. అప్పట్లోనే హైదరాబాదులో ఎస్. కె. ఆంజనేయులు అనే నాటక ప్రయోక్త సహజం నిర్వహించే ‘విసృతి’ నాట్యమండలి వారి నాటకాలు, వారి రిహార్సల్స్‌ని శ్రద్ధగా, దగ్గర్నించి పరిశీలించేవారు. ఆ ప్రేరణతో తాను కూడా నాటకాలకు దర్శకత్వం వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.
 
సైఫాబాద్ సైన్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంటర్ కాలేజీస్థాయి నాటక పోటీలు జరిగాయి. అందులో వారి కళాశాల నుండి భీంసేన్ రావ్ దర్శకత్వంలో ‘డాక్టర్ యజ్ఞం’ నాటికను వేయడానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. అందులో భానువూపకాష్‌కి ఏదైనా వేషం వేయాలనిపించింది. మొత్తం 30 మంది పోటీదారుల్లో తాను ఎంపికవుతానో లేనో అనుకున్నారు. కానీ, చివరికి భీంసేన్ రావ్ భానుని పిలిచి డా॥ యజ్ఞం పాత్ర డైలాగ్‌ను చెప్పించుకున్నాడు. మూడు రోజుల తర్వాత అందులోని ఆ ప్రధాన పాత్ర (డా॥ యజ్ఞం) కోసం భానువూపకాష్ ఎంపికైనట్లు ప్రకటించారు. ఇది తనకు ఊహించని అవకాశం. అయితే, భాను దానిని ఊరికే పోనీయలేదు. చక్కగా సకాలానికి ఉపయోగించుకున్నారు. రిహార్సల్స్‌కి ముందు భీంసేన్ రావ్ సెలవులో వెళ్లవలసి రావడంతో దర్శకత్వ బాధ్యతలను ఆయన భానుకి అప్పగించి వెళ్లారు. పూర్వానుభవం ఏమీ లేకున్నా ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. తిరిగి వచ్చిన భీంసేన్ నటులకు లభించిన తర్ఫీదును చూసి ఆశ్చర్యపోయారు. భానును ఆనందంతో అలింగనం చేసుకున్నారు. ఆ నాటిక అద్భుతంగా రాణించింది. దానికి బహుమతులూ వచ్చాయి. ఇలా తొలి అడుగులోనే విజయం సాధించారు.
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు