భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
ఒకసారి భాను ప్రకాష్ నాటకాన్ని చూసిన నిర్మాత [[దుక్కిపాటి మధుసూదనరావు]] తొలుత తన [[డాక్టర్ చక్రవర్తి]] సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే పూలరంగడు లో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివి పాత్రను ఇచ్చారు. ఇందులోఆయన తనదైన విభిన్నమైన విలనీని చూపారాయన. పెద్ద నటులు చాలామందే ఉన్న ఈ సినిమాలో తన నాటకానుభవంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారాయన. ‘నాకు రంగస్థలంపైనే తొలి ప్రేమ. తీరుబడి దొరికితే తప్ప సినిమాలవైపు చూడను’ అనే వారాయన. నాటక రంగం పట్ల ఆయనకున్న అభిలాషకు, నిబద్దతకు ఇది నిదర్శనం.
 
== అవార్డులు, పురస్కారాలు ==
50 ఏళ్లకు పైగా రంగస్థల, సినీ రంగాలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి.
* ‘సుడిగాలి’, ‘గాలివాన’, ‘కెరటాలు’ నాటకాలకు ఉత్తమ దర్శకుడిగా వరుసగా మూడుసార్లు ఎంపికై ‘రోలింగ్ షీల్డ్’ అందుకున్నారు.
* 1972లో మరో రెండు బంగారు పతకాలను, 1974లో ‘బళ్లారి రాఘవ’ అవార్డుతో వెండి కిరీటం పొందారు.
* ‘యువ కళావాహిని’ సంస్థ కె.వేంక అవార్డు.
* తెలుగు యూనివర్సిటి ఉత్తమ నటుడి అవార్డు.
* ఎ.ఆర్.కృష్ణ స్మారక పురస్కారం.
* 1988లో ఉగాది పురస్కారం.
* జూలూరు వీరేశలింగం అవార్డు.
* కిన్నెర ఉగాది పురస్కారం.
* నాటక కృషీవలుడు పురస్కారం.
* రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం వంటివి ఎన్నో ఆయనను వరించాయి.
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు