డబ్బింగ్ జానకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
*'మాతృ దినోత్సవం' వచ్చిందంటే '[[20వ శతాబ్దం]]' చిత్రం లోని 'అమ్మను మించి దైవమున్నదా' పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో [[సుమన్ తల్వార్]] కి తల్లిగా ఈవిడ చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.
*ఈవిడ చేసిన సినిమాల్లో తొంభై శాతం వరకూ కంట తడిపెట్టించే సెంటిమెంటు పాత్రలే. గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ పక్కన ఉండాల్సిందే. సెట్‌లో ఏడ్చీ ఏడ్చీ ఇంటికి వెళ్లేసరికి కళ్లు ఎర్రగా వాచిపోయేవి. ఒకసారి '[[రక్తకన్నీరు]]' నాటకం వేసినప్పుడు ఏకధాటిగా మూడు గంటలు ఏడవాల్సి వచ్చింది. ఆ నాటకం పూర్తయ్యేసరికి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.
*ఈవిడ నటించిన సినిమాల్లో బాగా నచ్చినవంటే 'జంబలకిడి పంబ'లోని పాత్ర... 'రామాయణంలో పిడకల వేట'లోని గయ్యాళి అత్త పాత్ర.
*సెట్‌లో మర్చిపోలేని సందర్భమంటే '[[నిండు సంసారం]]' సినిమా చిత్రీకరణలో ఈవిడ చెట్టు మీద నుంచి నీళ్లలో దూకాలి. అసలే ఈవిడకు నీళ్లంటే భయం. దర్శకుడు చెప్పినప్పుడు కాకుండా ముందుగానే దూకడంతో డూప్ ఆర్టిస్టు ఈవిడను పట్టుకోలేదు. నీళ్లలో పడిపోయింది. తరవాత యూనిట్ సభ్యులు కాపాడారు కానీ నీళ్లు బాగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ప్రాణం పోతుందేమోనని చాలామంది భయపడిపోయారు.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/డబ్బింగ్_జానకి" నుండి వెలికితీశారు