ఇంద్రగంటి శ్రీకాంత శర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
తూర్పు గోదావరి జిల్లా [[రామచంద్రపురం]]లో శ్రీకాంతశర్మ [[మే 29]] [[1944]] న జన్మించాడు. సుప్రసిద్ధకవి [[ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి]] ఇతని తండ్రి కావడంతో చిన్ననాటి నుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టాడు. తెలుగులో ఎం. ఏ. పట్టభద్రుడై [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశాడు. అభ్యుదయ కవిగా శర్మ ప్రసిద్ధుడు.
 
1976లో [[ఆకాశవాణి]] విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు. తెలుగు ప్రసంగాల శాఖకు [[ఉషశ్రీ]]కి సహాయకునిగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించాడు. శర్మ వివిధ పత్రికలలో గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలు వ్రాశాడు. అనేక రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలు రచించాడు. రేడియో ప్రసంగాలు చేశాడు. ఇతడు రచించిన అమరారామం రూపకం 1981 లో జాతీయ స్థాయిలో బహుమతి పొందింది. 1986లో ' వర్షానందిని ', ' నేను కాని నేను ' బహుమతులు జాతీయస్థాయిలో అందుకోవడం విశేషం 1994లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నిజామాబాద్ కేంద్రంలో పనిచేశాడు. 1995లో స్వచ్చంద పదవీ విరమణ చేసి [[ఆంధ్రప్రభ]] సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరాడు. కృష్ణావతారం (1982), నెలవంక (1983), రావు - గోపాలరావు (1984) మొదలైన చిత్రాలకు గీతరచన చేశాడు.
 
==రచనలు==