సయ్యద్ నశీర్ అహ్మద్: కూర్పుల మధ్య తేడాలు

చి అహ్మద్ నిసార్, పేజీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ను సయ్యద్ నసీర్ అహ్మద్ కు దారిమార్పు లేకుండా త...
→‎రచనలు: వికీకరణ
పంక్తి 76:
 
అను గ్రంథాలు వెలువరించారు.
 
==చరిత్రకారుల నిర్లక్ష్యం==
 
ఆధునిక ఆంధ్రుల సాహితీ చరిత్రను పునర్మించడంలో సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారిది ఉన్నత”మైన పాత్ర. భారతదేశ వ్యాప్తంగా చరిత్ర నిర్మాణంలో, పరిశోధనా పద్దతిలో, సబాల్ట్రన్‌ దృక్పధం వచ్చింది. భారతదేశంలో నిర్లక్ష్యం చేయబడిన, నిరాకరించబడిన, ఆణిచివేయబడిన మూడు తరగతుల వారి చరిత్ర నిర్మాణమే సబాల్ట్రన్‌ చరిత్ర నిర్మాణం అంటారు. జాతీయోద్యమకాలంలో మొదట ఆంగ్లం చేర్చుకున్న బ్రాహ్మణవర్గం, కులీనవర్గం తమకు అనుకూలంగా చరిత్రను మార్చి రాసుకున్నారు. బ్రహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, జమీందారీలు భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడిపినట్టు పేర్కొన్నారు. ఆదికాదు అని చెప్పడానికి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆనాడే 'గాంధి-రెనడే-జిన్నా' పుస్తకం రాశాడు. అందులో గాంధీకి సమాంతరంగా, సమానంగా జిన్నాని, రెనడేని ఎక్స్‌పోజ్‌ చేశాడు. ఇది గొప్ప ప్రయత్నం. ప్రత్యామ్నాయ చరిత్రకి, వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ గ్రంథం దిస్చూచి అయ్యింది. సయ్యద్‌ నశీర్‌ ఆహమ్మద్‌ రాసిన 'భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథంలో ఆ స్థాయిలో ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల, జాతీయోద్యమకారుల వ్యక్తిత్వాలను చిత్రించారు.
==నసీర్ అహ్మద్ నైపుణ్యాలు ==
నశీర్‌ అహమ్మద్‌ పాత్రికేయుడు కావడం, చరిత్ర, చట్టం, వాణిజ్య శాస్త్రం, పాత్రికేయ వైశిష్టం, జనజీవన సంబంధాలు కలిగి ఉండటంతో బహు ముఖీన నైపుణ్యాన్ని ఈ గ్రంథంలో చూపించాడు. ఈ గ్రంథంలోనే కాదు భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ నశీర్‌ రాసిన ప్రతి గ్రంథంలో బహు ముఖీన నైపుణ్యం సుస్పష్టమవుతుంది. ఈయన రచనా పద్దతిలో ప్రవాహశీలత పాఠకుడ్ని తన వెంట నడిపించుకుంటూ వెడుతుంది. ఆ కారణంగా భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ నశీర్‌ రాసిన తొమ్మిది గ్రంథాలలో ఐదు గ్రంథాలు మూడుసార్లు, నాలుగు గ్రంథాలు రెండుసార్లు పునర్ముద్రణ అయ్యాయి. ఒక ఉద్యమాన్ని, చరిత్రను సమన్వయించి రాసేప్పుడు సమకాలీన సామాజిక దృష్టి ఉండాలి. భారత స్వాతంత్య్రోద్యమం, జాతీయోద్యమాన్ని రచించిన రచయితలకు పాఠ్యగ్రంథ రచనా పద్దతి అలవడింది. అందులో తేదిలు, ఘటనలు, నామవాచకాలు, నుతులు, స్తుతులు తప్ప గుండెను కదిలించే వర్ణనలు, విశ్లేషణలు తక్కువ. కానీ నశీర్‌ అహమ్మద్‌ గ్రంథాలన్నీ కదులుతున్న సముద్రంలా ఉంటాయి. పాఠకుడ్ని ఆ ఘటనల్లోని ఉద్వోగంలోకి తీసుకెడుతాడు నశీర్‌. అది ఆయనకు కొన్ని థాబ్దాలు 'ఉదయం' లోనూ, 'వార్త' దినపత్రికల్లో ప్రజాజీవనాన్ని చిత్రించిన నైపుణ్యం నుండి వచ్చింది.
సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ కోట్‌ చేసే అంశాలు కూడా ప్రమాణబద్దమైనవి. ఆయన నూతన గ్రంథం 'భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథానికి రాసిన ఉపోద్ఘాతం (కథనం) ఆయన దృక్పధానికి గీటురాయి. ఆయన కేవలం రచయిత కాదు, కేవలం విశ్లేషకుడు కాదు, ఒక దృక్పధానికి ప్రతినిధి. అందుకే ఈ తరం ఆయన వైపు చూడాల్సిన అవసరాన్ని ఆయన సృష్టించాడు. ఆ దృక్పధమే ఆయన రచనకు జవం-జీవం. అదే ఆయనను 'చరిత్ర నిర్మాణ శాస్త్రవేత్త'గా మార్చింది. డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ కూడా 'అసృశ్యులెవ్వరు?' గ్రంథం రాసేప్పుడు ఆయన పీఠిక రాశాడు. అందులో తన చారిత్రక దృక్పధం ఎమిటో చెప్పాడు. అందుకనే సబాల్ట్రన్‌ హిస్టోగ్రఫీకి అంబేద్కర్‌ ఆద్యుడయ్యాడు. ఆ రచనా విధానం కొనసాగింపులోనే సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రూపొందారు.
 
==నసీర్ అహ్మద్ రచనల ప్రధానాంశం==
ఆయన దృక్పథంలో ప్రధానాంశం భారతీయ ముస్లింలు, జాతీయోద్యమ థ నుండి అంతకుముందు సాగిన సాయుధ పోరాట థ నుండి భారతదేశాన్ని రక్షించడానికి, విముక్తం చేయడానికి భారత స్వాతంత్య్రోద్యమంలో తమ నెత్తురు ధారబోశారు. అది ఈ భూమిలోకి ఇంకినంతగా అక్షరాల్లోకి ప్రవహించలేదు. ఆ కారణంగా ప్రజాబాహుళ్యం ఎరుకలోకి రాలేదు. ఇది కుట్రే. అని ఆయన ఉద్దేశ్యం. అంతేకాదు భారతీయ ముస్లింలు భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజాస్వామిక సైన్యంగా పాల్గొన్నారు, పోరాడారు. తమ సామాజిక శక్తిని, రాజకీయశక్తిని మొత్తంగా భారతీయ సమాజానికి అర్పించారు. చరిత్ర ఈ విషయాన్ని విస్మరిస్తే అది అసమగ్ర చరిత్ర అవుతుందని నశీర్‌ అహమ్మద్‌ ప్రతిపాదన. ఈ ప్రతిపాదనే ఆయన నూతన చారిత్రిక దృక్పథానికి వెలుగు తెచ్చింది. అయితే ఇటువంటి ప్రతిపాదనలు చేయడం అంత తేలికైన పనికాదు. అణిచివేసిన వాడి నుండే ఆయుధాన్ని చేత బూనాలి. అంతేకాదు దేన్ని నాశనం చేశారో అక్కడి నుండే మూలాలు వెతకాలి. దానికి అవసరమగు పరిశోధనా దృష్టి నశీర్‌కు ఉంది. చరిత్రకారుడు పరిశోధకుడు కలిస్తే చరిత్ర కాల్పనికం కాకుండా సత్యనిష్టం అవుతుంది. అందుకనే తాను రాసిన చరిత్ర గ్రంథాలలో ఆయన పుంఖాను పుంఖాలుగా ఉపపత్తులు మన ముందుంచుతున్నారు. ఎవ్వరూ కాదనలేని ప్రమాణాలు చూపిస్తున్నారు. అది సత్యనిష్టయే కాకుండా చారిత్రక పరివర్తితం కావడం కోసం తేదిలు, సంఘటనలు కూడా ఆయన ఇస్తున్నారు. దీంతో ఆయన ఒక ప్రామాణిక చరిత్రకారుడుగా నిగ్గుతేలారు.
Line 99 ⟶ 105:
బహుగ్రంథ రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ మంచి మనిషి, స్నేహపాత్రులు. అందుకే ఆయన తాను రాసే వ్యక్తులు జీవించి ఉంటే కలిశారు. సుదూర ప్రయాణాలు చేశారు. వారి కుటుంబ సభ్యులతో మమేకం అయ్యారు. వారి వ్యధను అర్థం చేసుకున్నారు. నిర్లక్ష్యపూరిత మైనది ప్రతిదీ వ్యధార్థమవుతుంది. దాన్ని లిఖించాడు. అదే ఈనాడు కావాల్సింది. ఇప్పటి రచయితలు పుస్తకాలు మాత్రమే వెతికి రాస్తారు. మస్తకాల గురించి వారికి తెలియదు. పుస్తకాన్ని మస్తకాన్ని కలిపి పెనవేయడమే నశీర్‌ రచనా శిల్పం.
==మరుగున పడిన వీరుడు==
1857 కంటె 70 ఏండ్ల ముందుగా మన విశాఖపట్నంలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలో ఆంగ్లేయాధికారుల మీద తిరుగుబాటు పతాకాన్ని ఎగురవేసిన సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ సాహసోపేత పోరాటాన్ని రాసేప్పుడు యుద్ధకౌశల్యం, ఎత్తుగడలు, ప్రతి వ్యూహాలు, ఆంగ్లేయులను దెబ్బతీసే విధానాలు కండ్లకు కట్టినట్టుగా చిత్రించాడు. ఆనాటి ప్రపథమ సైనిక తిరుగుబాటు నాయకుని గురించి 'భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథంలో రాసే సందర్భంగా (128వ పేజిలో) ఇలా వర్ణించారు. 'సుబేదార్‌ అహమ్మద్‌ నేతృత్వంలో తిరుగుబాటు యోధులు విజయపథాన కదం తొక్కుతూ సైనిక స్థావరం అధికారి కాసామేజర్‌ (్పుబిరీబిళీబిశీళిజీ) ను అరెస్టు చేశారు. అతని విూద కూడా కాల్పులు జరిగాయి. ఆ సమయంలో ఒక సిపాయి అడ్డుపడి వారించడంతో అతను బ్రతికిపోయాడు. అనంతరం అతడి నుండి స్థావరానికి సంబంధించిన పూర్తి రహస్యాలు, ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకున్న సుబేదార్‌ అహమ్మద్‌ ఆయన సహచరులు విశాఖపట్నం సైనిక స్థావరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. సైనిక ఆయుధాగారాన్ని హస్తగతం చేసుకున్నారు. స్థావరంలోని ఖజానాలో ఉన్న 21,999 రూపాయలను సొంతం చేసుకున్నారు. కాసామేజర్‌ స్వంత సొమ్ము సుమారు 15 వేల రూపాయలు కైవసం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆంగ్లేయుల స్థావరంలో బందీగా ఉన్న ఫ్రెంచ్‌ గూఢచారిని బంధ విముక్తుడ్ని చేశారు. ఈ చర్యలలో స్థానిక ప్రజలు కూడా భాగస్వాములయ్యారు.'
ప్రస్తుత 'భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గ్రంథం ఇంతకుముందు రాసిన 'మైసూరు పులి ః టిపూ సుల్తాన్‌'లో పెల్లుబికిన స్ఫూర్తితో ఉంది. చరిత్రలో వర్ణణాత్మక విధానం అత్యున్నతమైనది. ఈ గ్రంథం ద్వారా ఉర్దూ, పారశీక, ఆంగ్ల పదాలను తెలుగు నుడికారాన్నీ ఆంధ్ర పాఠకులకు వందలాదిగా అందించారు. దీన్నే భాషా సంపన్న రచన అంటారు. అంటే రచయిత తన రచనల ద్వారా భాషను కూడా నేర్పుతున్నారు. ఇక్కడ నశీర్‌లోని చాలా బలమైన పాత్రికేయుడు కన్పిస్తాడు.
శీర్‌నసీర్ అహమ్మద్‌అహ్మద్ వ్యక్తిగా పనిచేస్తున్నారా ? సంస్థగా పనిచేస్తున్నారా ? మనకు ఆశ్చర్యం. ఆయన చేపట్టిన రచనలన్నీ ఆంగబలం అర్థబలం పుష్కలంగా గల వ్యవస్థలు, విశ్వవిద్యాలయాలు మాత్రమే చేయగలిగినవి. అటువంటి ప్రాజెక్టులను ఆయన విజయవంతంగా పూర్తిచేసుకపోతుంటే విస్మయం కలుగుతుంది. అయితే ఆయన వ్యక్తి ఏ మాత్రం కారు. ఎందుకంటె వాళ్ళమ్మగారు షేక్‌ బీబిజాన్‌ గొప్పతల్లి. నేను యుధ్దంలో ఉన్పప్పుడు నా నొసటన ముద్దుపెట్టి, నా వెన్నుతట్టిన తల్లి ఆమె. నశీర్‌ తండ్రి చిన్ననాటనే చనిపోయారు. తల్లి పట్టుదల, త్యాగంతో బిడ్డను అత్యున్నత చదువులు చదివించింది. నశీర్‌ జీవిత భాగస్వామి షేక్‌ రమిజా భానులో సగం తల్లి ఉంది. ఆమె భర్తకు మొస్ట్‌ ప్రోటక్ట్రివ్‌ ఫోర్స్‌గా నిలచింది. భర్త ఉన్నతిని, విస్త్రుతిని, డైనమిజాన్నీ ప్రేమించిన వ్యక్తి. ఎక్కువ మంది భార్యలు భర్తలో ఉన్న క్వాలిటీని గుర్తించకే ఘర్షణకు గురవుతారు. కొంతమంది క్వాలిటీ, ఎబిలిటీని కూడా ప్రేమిస్తారు. అప్పుడు ప్రేమ విస్త్రుతి అవుతుంది. శ్రీమతి రమిజా ప్రేమలో సంపూర్ణత ఉంది. ఒకవైపున తల్లి మరోవైపున భార్య ఆయన అండదంగా నిలుస్తున్నందున నశీర్‌ వ్యవస్థ కాగలిగాడు. అటువంటి వ్యవస్థల్లోంచి పలు ప్రయోజనాత్మక ఉత్పత్తులు ఉబికి వస్తాయి అటువంటి ఉత్తమ ఉత్పత్తులలో రచన ఒకటి.
నశీర్‌ ఒక రచయితే కాదు, బోధకుడు, నిర్మాణకర్త కూడా. ఆయన ఈ మూడు థాబ్దాల్లో చాలా సభల్లో, సదస్సుల్లో పాల్గొన్నారు. సాధికారిక ఉపన్యాసాలు, ప్రసంగాలు చేశారు. పలు సామాజిక ప్రజా ఉద్యమాల నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన నిరంతరం డిబేటబుల్‌ పర్సన్‌. ఆయనలోని గొప్పదనం 'వాది-ప్రతివాది'. ఎదైనా చెప్పదలచుకుంటే సూటిగా చెబుతారు. మార్మికత లేదు. మేం 1979లో కలిశాం. ఆయనతోపాటుగా నరసరావుపేటకు చెందిన యస్వీయార్‌, బివికె పూర్ణానందం, వియస్‌యన్‌ మూర్తి, జేవియార్‌ వీరంతా కలిశారు. మేమంతా సామాజిక ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశాం. వివిధ రంగాలలో హేతువాద భావజాలంతో పోరాడుతున్నాం, జీవిస్తున్నాం. ఎందరో తత్త్వవేత్తల్ని చదివాం. ప్రధానంగా హ్యూమనిజం, విజ్ఞానం, తర్కం, సమన్వయాలను ఉద్యమాలు మాకు నేర్పాయి. నశీర్‌కు పత్రికలు నడిపిన అనుభవం ఉంది. ఆయన మానవతా ప్రదీపకుడు. ఒక పోరాట యోధుడ్ని ఆయన జీవితం ముగియక ముందే రికార్డు చేయాలన్న పట్టుదల, తపన తన గ్రంథాలలో కన్పిస్తుంది. ఇలా రాయక ఎందరో త్యాగమూర్తుల జీవితాలు అక్షరబద్దం కాలేదు.
Line 115 ⟶ 121:
ఒక థాబ్దిలో వచ్చిన ఒక గ్రంథాన్ని మనం చదవకపోతే మనం అసమగ్రులం అయినట్లయితే ఆ గ్రంథం ఉత్తమ గ్రంథం కాగలదు. అంటే ఆ గ్రంథానికి మనల్ని పూరించే శక్తి ఉంది. రచయిత మనకు తెలిసిన వాడే కావచ్చు. తెలియని అనంత విషయాలను మనకు చెబుతున్నారు. ఆ కారణంగా 'భారత స్వాతంత్య్రోద్యమం ః ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' ప్రతి ఆంధ్రుని చేతిలో ఉండితీరాల్సిన ఉత్తమ గ్రంథం. ఈ గ్రంథం పాఠ్యగ్రంథంగా ఉండదగింది. బ్రాహ్మణవాద చారిత్రక అంశాలు పాఠ్యగ్రంథాలుగా ఉండటం వలన ద్వితీయ పార్శ్యం విద్యార్థులకు బోధపడటం లేదు. ఇటువంటి గ్రంథాలు రావడం వలన చారిత్ర సృహ విస్త్రుతి పొందుతుంది. సబాల్ట్రన్‌ స్టడీస్‌కు అమూల్య గ్రంథం చేర్చిన చరిత్రకారుడు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ కంట్రిబ్యూషన్‌ మరువలేనిది. అది పాఠకుల అధ్యయనంతో సుసంపన్నం అవుతుంది.
 
 
 
==ఇవీ చూడండి==