స్వలింగ సంపర్కం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Courbet Sleep.jpg|thumb|right|కోర్బెట్ "[[నిద్ర]]" చిత్రపటంలో ఇద్దరు స్త్రీలు]]
స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఈ లైంగిక సంబంధము సృష్టి విరుద్ధము. ఇప్పటివరకు భారత శిక్షాస్మృతి (ఐపిసీ 377 సెక్షన్) ప్రకారం '''స్వలింగ సంభోగం''' (Homosexual intercourse) నేరం. ఢిల్లీ హైకోర్టు 2.7.2009 న ఇచ్చిన తీర్పు ప్రకారం '''స్వలింగ [[సంభోగం]]'' నేరం కాదు.ఇది చట్టం ఐతే దీనిని నేరంగా పరిగణించని దేశాలలో మనది 127 వ దేశం అవుతుంది. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందనను తెలియజేయాలని ఆదేశిస్తూ 9.7.2009న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. స్వలింగ సంపర్క చట్టానికి 149 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటీష్‌ పాలకుడు లార్డ్‌ మెకాలే 1860వ సంవత్సరంలో స్వలింగసంపర్కానికి సంబంధించిన 377 సెక్షన్‌ను భారత శిక్ష్మా స్మృతిలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఈ సెక్షన్‌ ప్రకారం ‘ఎవరై నా ప్రకృతి ఆదేశాలకు విరుద్ధంగా స్వచ్ఛందంగా ఒక పురుషుడితో కాని, మహిళ లేదా జంతువులతో కానీ భౌతికంగా సంభోగిస్తే జీవిత కాల శిక్షార్హులు.
ఈ శిక్షను మరో పదేళ్లపాటు పొడిగించే అవకాశం తో పాటు జరిమానా విధించవచ్చు’ అని అందులో పొందుపరిచారు. అప్పుడు ‘పురుష మైథున వ్యతిరేక చట్టం’గా వ్యవహరించబడుతున్న ఈ 377 సెక్షన్‌ ను 1935లో సవరించారు. దాని పరిధిని విస్తరిం చారు. [[అంగచూషణ]] (ఓరల్‌ సెక్స్‌) ను కూడా 377 సెక్షన్‌లో చేర్చారు. అయితే కాలక్రమంలో తీర్పుల్లో వస్తున్న మార్పులకనుగుణంగా 377వ సెక్షన్‌లో స్వలింగ లైంగిక సంపర్కాన్ని కూడా చేర్చారు. అయితే, ఇటివల స్వలింగసం పర్కంపై ఢిల్లీ హై కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. 'స్వలింగ సంపర్కం' నేరంకాదని, అలాపరిగణించడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడ మేనని తీర్పు ఇచ్చింది. అయితే, బలవంతపు 'హోమోసెక్సువాలిటి' [[మానభంగం]] కనుక, శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కూడా ఆ తీర్పులో తెలిపింది. స్వలింగసంపర్కం చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా డెన్మార్క్‌ (నెదర్లాండ్‌). ఆ తరువాత నార్వే, స్వీడన్‌, ఐలాండ్‌ దేశాలు డెన్మార్క్‌ను అనుసరించాయి. ఆఫ్రికాలో అత్యధిక దేశాల్లో స్వలింగ సంపర్కం చట్ట వ్యతిరేకం. దక్షిణాఫ్రికాలో స్వలింగ సంపర్కులకు రాజ్యాంగంలో స్థానం కల్పించారు. 2007వ, సంవత్సరంలో నేపాల్‌ సుప్రీంకోర్టు, లెస్బియన్లు, స్వలింగ సంపర్కులు, లింగమార్పిడిదారుల చట్టాలను రద్దు చేయాలని వారిని మూడో లింగంగా గుర్తించి వారికి పౌర హక్కులను కల్పించాల్సిందిగా కోరింది.
 
"https://te.wikipedia.org/wiki/స్వలింగ_సంపర్కం" నుండి వెలికితీశారు