కాశీమజిలీ కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
== ప్రాచుర్యం ==
కాశీమజిలీ కథలు విస్తృతమైన ప్రజాదరణ, పాఠకాసక్తిని సాధించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ కథలు పాఠకులను చదివింపజేయడమే కాక పలువురు గ్రంథకర్తలు స్పందించేలా చేశాయి.
* కాశీమజిలీ కథలు సినిమా రంగంపై కూడా తమ ప్రభావం చూపాయి. ఈ కథలు తెలుగు జానపద చలన చిత్రాలను విపరీతంగా ప్రభావితం చేశాయి. కొన్ని చిత్రాలలో కథలకు కథలు యధాతథంగా స్వీకరించి ఉపయోగించుకున్నారు.<ref name="telugu velugu">కాశీ చేరుతున్న మజిలీ కథలు:దేవవరపు నీలకంఠరావు:తెలుగు వెలుగు పత్రిక:సెప్టెంబర్ 2014:పేజీ.24-26</ref>
* సాహిత్యరంగంలో పలువురు రచయితలు వీటిని అనుసరించి లేదా వీటి స్ఫూర్తితో రచనలు చేశారు. కొన్ని పేదరాశి పెద్దమ్మకథలు, చందమామ కథలు, మర్యాద రామన్న కథల్లో కాశీమజిలీ కథలలోని ఇతివృత్తాలు, శైలి, నాటకీయత, శిల్పం వంటివి అనుసరించినట్లు తెలుస్తుంది.
 
== ఇతరుల మాటలు ==
* ఇవి కేవలము కథల వంటివేగాక వ్యాకరణాది శాస్త్ర సంప్రదాయములయందేమి యలంకారాదుల యందేమి మన ప్రాచీన కావ్యములకించుక దీసిపోవు.. -[[చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]]
"https://te.wikipedia.org/wiki/కాశీమజిలీ_కథలు" నుండి వెలికితీశారు