కొండవీటి గుర్నాథరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[భారత స్వాతంత్ర్యోద్యమము]] లోనూ, [[తెలంగాణ సాయుధ పోరాటం]] లోనూ పిడికిలెత్తిన ఉద్యమకారుడు... వందలాది ఎకరాల భూమిని పంచి తుదిశ్వాస విడిచేదాకా నిరాడంబర జీవనం సాగించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, నిస్వార్థ సేవకుడు.
 
పదహారేండ్ల వయస్సులోనే 1938లో [[హైదరాబాద్‌]] లో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దేశ నాయకులైన [[గాంధీ]], [[నెహ్రూ]] ఉపన్యాసాల కోసం హైదరాబాద్ నుంచి [[ముంబై]] వరకు 18 రోజుల పాటు కాలినడక సాగించారు. నిజాం నిరంకుశపాలన, కట్టు బానిసత్వం, వెట్టి చాకిరీలకు చలించి 1942లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరాడుచేరారు.
 
స్వామి రామానందతీర్థ పిలుపు మేరకు 1947లో వంద మంది దళ సభ్యులను చైతన్య పరచి సాయుధ పోరాట ఉద్యమాన్ని సాగించారు. పిత్రార్జితంగా వచ్చిన వ్యసాయ భూములను పేదలకు పంచారు. దొరల పెత్తంధార్ల బెదిరింపులకు లొంగకుండా ఊరూరా ఎర్రజెండాలను నాటి వెట్టి చాకిరికి వ్యతిరేఖంగా ఉద్యమించారు. ఆ సమయంలో తొమ్మిది నెలల పదిహేను రోజుల జైలు జీవితం అనుభవించి చిత్రహింసలకు గురయ్యారు.
 
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]