అనుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:
==గ్రామ విశేషాలు==
#కుమారి వీర్ల నాగపద్మ:- ఈ గ్రామానికి చెందిన శ్రీ వీర్ల శ్రీను, ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వారు. భార్యాభర్తలిద్దరూ కూలీనాలీ పనిచేసి కుటుంబన్ని పోషించుచున్నారు. వీరు తమ కుమార్తె నాగపద్మను కష్టపడి చదివించుచున్నారు. నాగపద్మను పదవ తరగతి వరకు, స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోనే చదివించినారు. ఈమె పదవ తరగతిలో మండలంలోనే ప్రధమ స్థానంలో ఉత్తీర్ణురాలయి, ట్రిబుల్ ఐ.టి. నూజివీడులో సీటు సాధించినది. అక్కడే ఇంటరు పరీక్షలు వ్రాసిన ఈమె, 2014,మే-14న అమెరికాలోని "నాసా" అంతరిక్ష పరిశోధనా కేంద్రం వారి అహ్వానం మేరకు అక్కడ ఒక సదస్సుకు హాజరైనది. ఆ సదస్సులో మొత్తం 400 మంది వివిధ దేశాలకు చెందినవారు హాజరైనారు. ఆ సదస్సులో ఈమె, తను రూపొందించిన ఏరోనాటికల్ ప్రాజెక్టులో క్రియేటివ్ అనదర్ వరల్డ్ "నిత్య" అను ప్రాజక్టును వివరించినది. భవిష్యత్తులో భూమి నాశనమైతే, ప్రజలు ఎక్కడ ఉండాలనే దానిపై ప్రత్యామ్నాయం 'స్పేస్' ను తన ప్రాజెక్టులో చూపించినది. ఈ ప్రాజెక్టుకు అక్కడి సీనియర్ సైంటిస్ట్ శ్రీ ఆల్ గ్లోబస్ మెచ్చుకొని అభినందించినారు. ఈ సందర్భంగా నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ వారు ఈమెకు ఒక ధృవపత్రం అందజేసినారు. ఈమె ఈ సదస్సుకు హాజరవడానికి ఒక లక్ష రూపాయలను జిల్లా పాలనాధికారి శ్రీ సురేష్ కుమార్, చొరవ తీసుకొని జిల్లా పరిషత్తు సాధారణ నిధులనుండి, జిల్లా పరిషత్తు సి.ఏ.ఓ. శ్రీ సుబ్బారావు తో మంజూరు చేయించినారు. ఇంకా మరికొందరు దాతలు గూడా ఆర్ధిక సహాయం చేసినారు. <ref>ఈనాడు గుంటూరు సిటీ; 2014,మే-29;2వ పేజీ.</ref>
#శ్రీ మద్దెల పునీత్ కుమార్, బాక్సింగ్ వీరుడు:- వీరి తండ్రి శ్రీ నాగరంగారావు, సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందినారు. తల్లి శ్రీమతి విజయలక్ష్ము పిడుగురాళ్ళలోని ఒక పాఠశాలలో పి.యి.టి. గా పనిచేయుచున్నారు. తాత శ్రీ దాసరి వెంకటరావు, సైన్యంలో సుదీర్ఘకాలం పనిచేసినారు. ఈయన జాతీయస్థాయిలో, బాక్సింగు క్రీడలో, పలుమార్లు బంగారు పతకాలు సాధించినారు. పునీత్ కుమార్ కు చిన్నప్పటినుండి ఆటలు అంటే మక్కువ. పాఠశాల స్థాయిలో పలుక్రీడలలో ప్రతిభ కనబరచినారు. తాతయ్య స్పూర్తితో ఈయన బాక్సింగ్ రంగంలో దిగి, తాతయ్య దగ్గర ఓనమాలు నేర్చుకొని, స్థానికంగా శిక్షణపొంది, అందివచ్చిన అవకాశాలను వినియోగించుకొని, రాష్ట్ర, పలు పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించినారు. వీరు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మూడు బంగారు పతకాలనూ. రెండు కాంస్య పతకాలనూ సాధించి, భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీలలో పాల్గొని, తద్వారా ఒలింపిక్స్ లో పోటీపడాలని ఉవ్విళ్ళూరుచున్నాడు. [3]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఆగష్టు-28; 16వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014,సెప్టెంబరు-1; 3వపేజీ
 
 
 
"https://te.wikipedia.org/wiki/అనుపాలెం" నుండి వెలికితీశారు