ప్రాణ్ కుమార్ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

 
చి వర్గం:1938 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
ఈయన 1938 లో కసూర్‌లో పుట్టారు. గ్వాలియర్‌లో బిఏ చదివి ఢిల్లీకి వచ్చి ఈవెనింగ్ కాలేజీ ద్వారా ఎంఏ పట్టా తెచ్చుకున్నారు. బొంబాయిలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌స్ నుండి ఐదేళ్ల ఫైన్ ఆర్ట్‌స్ కోర్సును దూరవిద్య ద్వారా చదివారు. ఏదైనా స్కూలులో డ్రాయింగ్ టీచరు అవుదామనుకుంటూనే ఢిల్లీ నుండి వెలువడే ‘‘మిలాప్’’ అనే దినపత్రికలో తన 22 వ యేట కార్టూనిస్టుగా చేరారు. ‘‘దాబూ’’ అనే ఒక పాత్ర సృష్టించి దాన్ని పాప్యులరైజ్ చేశారు. అదొక్కటే కాదు శ్రీమతీజీ, పింకీ, బిల్లూ, రామన్, చన్నీ చాచీ - ఇలాంటి పాత్రలు సృష్టించి వాటి సీరీస్ నడిపారు. కన్నడంలో ‘‘ప్రజావాణి’’ దినపత్రిక కోరికపై అక్కడ కూడా ‘‘పుట్టి’’, ‘‘రామన్’’ వంటి పాత్రలతో సీరీస్ నడిపారు. అయితే ఆయనకు అమితంగా పేరు తెచ్చిన చాచా చౌధురీ పాత్ర 1969లో పుట్టింది. తెలుగులో ‘మునసబు పెదనాన్న’ అనుకోవచ్చు. ఆయన వయసులో పెద్దవాడు, శారీరకంగా మరీ బలవంతుడేమీ కాదు. తలపాగ, వెయిస్టుకోటు, చేతిలో చేతికర్ర, వెంట రాకెట్ అనే ఒక కుక్క. బుద్ధిబలం మాత్రం అపారం. కంప్యూటర్ల వంటి ఆధునిక యంత్రాలేమీ లేకుండా కేవలం నిశిత పరిశీలనతో చురుకుగా ఆలోచించి, కేవలం కామన్‌సెన్స్‌తో సమస్యలు పరిష్కరిస్తాడు, దొంగల్ని పట్టేస్తాడు.
==బయటి లంకెలు==
 
[[వర్గం:1938 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రాణ్_కుమార్_శర్మ" నుండి వెలికితీశారు