శ్రీరామోజు హరగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
 
శ్రీరామోజు హరగోపాల్-మట్టిపొత్తిళ్ళు
కవిత్వం రాయడానికి మంచి వస్తువొకటికావాలి.వస్తువులకోసం వెదుకనక్కర లేదు.మనచుట్టూ ఉన్న జీవితాలు,సమాజం,అందుకు ఊనిక నిస్తాయి.సాధారణంగా ఏవస్తువులైనా గతంలొ ఎవరో ఒకరు కవిత్వీకరించే ఉంటారు.కాని కవి నిర్మాణ శక్తినుంచి ఇవి నూతనంగా కనిపిస్తాయి.ఒక అంశం మీద రాస్తున్నప్పుడు సాధారణంగా కొన్ని ప్రతిఫలనాలుంటాయి.ఆయా జీవితాలతో ఆ అంశాలు పెనవేసుకొని ఉండటమే కారణం.
సామాన్యంగానే ఒక సాధారణ ఉద్వేగాన్నుంచి కవితని రూపొందించటం కష్టం.అలా రూపొందిన కవితలొ ప్రధానంగా వర్ణనే ఎక్కువ.ఇలాంటివాటిలో ఙ్ఞానంకంటే హృదయమే ఎక్కువ.హరగోపాల్ 'మట్టిపొత్తిళ్ల"నుంచి జన్మిస్తానని చెబుతూ మరణాలపట్ల తన దిగ్భ్రాంతిని నిస్సహాయతపట్ల తన ఆవేశాన్ని వ్యక్తం చేసారు.
"పురుగులమందు తాగి రైతులుప్రత్తిపింజెలకే ఉరిపోసుకుంటుంటేమెడమీద విరిగిపడ్డ కాడితో శవాలింకాఈ నేలలో ప్రాణాల్ని విత్తుతూనేవున్నాయ్చాలు చాలుకీ ధారవోసిన చెమటలుసముద్రాలై వెక్కెక్కిపడ్తున్నాయ్"
ఒక క్షణంలో కలిగే ఉద్వేగాన్ని చెప్పడానికి అనేకమైన ప్రతీకల్ని,భావనలని వాడుకుంటారు."ప్రత్తి పింజెలకి ఉరిపొసుకోవటం""చెమటలు సముద్రాలై వెక్కెక్కి పడటం"-బలమైన వ్యక్తీకరణలు.రైతు పడ్ద శ్రమని కళాత్మకంగా చెప్పడం ఇక్కడ కనిపిస్తుంది.
"నాగలితో రైతులు పగులదీసిన బీళ్ళగుండెల నెర్రెల్నిభూమి, వాళ్ళ పుర్రెలతోనే కప్పుకుంటున్నదితాము విత్తిన బీజశక్తులు, తమకేపాడెకట్టి శ్మశానాలకు మోస్తున్నాయి"
"నేనూ ఒక బీజాణ్ణై నీచేతిలోమొలకెత్తనీ నీ పాదాల మట్టిలో"
బలమైన ఉద్వేగాన్ని ప్రతిధ్వనించినా ఈవాక్యాల్లో చరిత్ర ఉంది.కొన్ని సార్లు రాజ్యంపై కొపగించడంవల్ల,శ్రమశక్తివైపు నిలబడటం వల్ల మార్క్సిస్ట్ భావనలు కనిపిస్తాయి.కొన్ని సార్లు ప్రత్యక్షంగా ఆ నినాదం కనిపిస్తుంది.
"ప్రభుత్వం పగటినిద్రపోతున్నదిఎవడేడ్చాడు రైతులకోసం?దేశం వెన్నెముకల మూలుగు పీల్చే హంతకులే అంతా"
"అన్నంలో విషంపోసుకున్న వాణ్ణెవ్వడూ కాపాడలేడుబలవన్మరణాల్ని శాసించిన ఈ వ్యవస్థకు తప్పదు మృత్యువు "
"ఈ కిరాతక రాజ్యాహంకారాల్నిదున్నెయ్"అనేక వాక్యాల్లొ బలమైన వ్యక్తీకరణలున్నాయి.నిజానికి ఒకతత్కాల స్థితిని ఇందులోవర్ణించినా ప్రధానంగా రైతుమరణం,రాజ్యపు గుడ్డితనం కనిపించినా వెనుక బలమైన వాతావరణం ఉంది.
గతంలోనందిని సిధారెడ్డి "ఉట్టితెగిన వాడు"కవిత రాసారు,డా.పత్తిపాక మోహన్"తెగినపోగు"రాసాడు.ఇవన్నీ ఆయాజీవితాల్ని వర్ణించినవే.ఇదీ అలాంటిదే అయినా అనేకంగా వర్ణన ఈ కవితనిసారవంతం చేసింది.మంచి కవిత అందించినందుకు హరగోపాల్ గారికి ధన్య వాదాలు.....మల్లావజ్ఝల నారాయణశర్మ
[[వర్గం:కవిసంగమం కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]