జానపద సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

జానపద సంగీతం
 
చి వర్గం:సంగీతం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9:
 
పంట విత్తనాలు వేసేటప్పుడు పాటలు, పంట చేతికొచ్చినప్పుడు పాటలు, పండుగల పాటలు, వారి పశువులకి సంబంధించిన పాటలు, వాన పాటలు, పడవ పాటలు, గొబ్బిళ్ళ పాటలు.. ఇదీ అదీ అని కాకుండా వివిధ అంశాల గురించి ఆనందంగా వారికొచ్చిన భాషలో పాడుకునేవారు. ఇలాంటి సంగీతం జానపదుల గీతాల్లో, నృత్యాల్లో, ఉత్సవాల్లో ప్రతిఫలిస్తుంది. పండుగలో మిళితమై వున్న పాటల్లో, నర్తనంలో ఇమిడివున్న సంగీతమే ఇందుకు దాఖలా. ప్రకృతితో, ప్రకృతిలోని పూలతో, పూల పరిమళా లతో అనుసంధానమై వున్న బతుకమ్మను కేంద్రంగా చేసుకొని వందలపాటలు వచ్చాయి. ఆ పాటలకీ, సంగీతానికీ అవినాభావ సంబంధం వుంది. సంగీతంలోని రాగం, తాళం, పల్లవి, జతి, లయ వంటి అంశాలు ఈ పాటలతో అనుసంధానమై వున్నాయి. నిజానికి సాహిత్యం, నృత్యం వంటి ప్రక్రియలతో కలగలిసి వుండటం భారతీయ సంగీతం ప్రత్యేకత. జీవితంలోని ప్రతి సందర్భాన్ని పాటలతో, సంగీతంతో దీప్తిమంతం చేయడం జనజీవన సంస్కృతిలో అంతర్భాగం.
 
[[వర్గం:సంగీతం]]
"https://te.wikipedia.org/wiki/జానపద_సంగీతం" నుండి వెలికితీశారు