"కలుగోడు అశ్వత్థరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| weight =
}}
బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబములో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు '''కలుగోడు అశ్వత్థరావు''' [[1901]] వ సంవత్సరం [[జూలై 25]] వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. రాయదుర్గం తాలూకా [[కలుగోడు]] లోను, [[కర్ణాటక]] రాష్ట్రం [[చిత్రదుర్గ]] జిల్లా తళుకు గ్రామంలోను కరణముగా పనిచేశాడు. ఈ రెండు గ్రామాలలోను ఇతనికి చాలినన్ని భూములున్నాయి. ఇతని జీవితం హాయిగా గడచింది. ఇంటికి వచ్చిన అతిథులను గొప్పగా సత్కరించేవాడు. తన గ్రంథాలను ప్రచురించుకొనడానికి స్వంతంగా రాయదుర్గంలో కవిరాజ ముద్రాక్షరశాలను నెలకొల్పాడు. తన చివరి దశలో దీనిని రాయల పరిషత్తుకు ఉచితంగా ఇచ్చివేశాడు.
 
==రచనలు==
# సర్వజ్ఞునివచనములు - కన్నడభాష నుండి తెలుగులోనికి అనువాదం
# ವೇಮನ ರತ್ನಗಳು - వేమన పద్యాలను కన్నడ భాషలోనికి అనువాదం
# అనుభవామృత సారము - మహాలింగ రంగ కన్నడలో వ్రాసిన అనుభవామృత అనే అద్వైత వేదాంత గ్రంథానికి తెలుగు అనువాదం
# సోమేశ్వర శతకము - పాల్కురికి సోమనాథుని కన్నడ శతకానికి తెలుగు అనువాదం
# హరిభక్తసారము - కనకదాసు కన్నడరచనకు తెలుగు సేత
# ಭಾಗವತ ಗೀತಿಗಳು - పోతనభారతంలోని గజేంద్రమోక్షము, రుక్మిణీకళ్యాణము, ప్రహ్లాదచరిత్ర,వామనచరిత్ర ఘట్టాల కన్నడానువాదము
# ಶೃಂಗಾರ ವರೂಧಿನಿ - మనుచరిత్ర కన్నడానువాదము
# ಕಂದಪದ್ಯ ರಾಮಾಯಣ - స్వతంత్ర కన్నడ రచన
# ಶ್ರೀಕೃಷ್ಣಲೀಲೆ(ಬೈಲು ನಾಟಕ) - స్వతంత్ర కన్నడ వీధి నాటకము
# ಸುಭದ್ರಾಪರಿಣಯ ನಾಟಕ - స్వతంత్ర కన్నడ రచన
# గధాయుద్ధము - రన్న కవిచే రచింపబడిన ಸಾಹಸ ಭೀಮ ವಿಜಯ అనే కన్నడ కావ్యానువాదము
# దండకరామాయణము
# అశ్వత్థ భారతము (ఆది చతుష్కము మాత్రము)
# ఆశ్వత్థేశ త్రిశతి (కందములు)
# మూడు శతకములు
# రెండు నాటకములు
# అక్కమహాదేవి వచనములు
# బ్రాహ్మణుడు
# గురుదక్షిణ
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1293190" నుండి వెలికితీశారు