జయమాలిని: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21:
'''జయమాలిని''' (జ. జూన్ 15, 1958) సుప్రసిద్ద దక్షిణాది సినిమా నటి. ఈమె [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]] , [[మళయాలం]] మరియు [[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 600 చిత్రాలలో నటించింది. శృంగార నృత్య తారగా ప్రసిద్ధి చెందినది. ఈమె సొదరి [[జ్యోతిలక్ష్మి]] కూడ సుప్రసిద్ద సినీ నర్తకి.<ref>[http://www.greatandhra.com/movies/news/sep2005/vamp_story.html Nostalgia: Story of Hot Vamps on Telugu Screen<!-- Bot generated title -->]</ref>. ఈమె 1970 నుండి 1990 దశకం వరకూ అనేక విజయవంతమైన చిత్రాలలో శృంగార నృత్యాలను చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
==నేపధ్యము==
ఈమె అసలు పేరు అలమేలు మంగ. ఈమె అమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. అందుకే అలమేలుమంగ అన్న పేరు పెట్టింది. అయితే ఆ పేరు చాలా మొరటుగా ఉందన్న ఉద్దేశంతో దర్శకుడు [[బి.విఠలాచార్య|విఠలాచార్య]] గారు ఈమెకు ‘జయమాలిని’ అని నామకరణం చేశారు.
 
==సినీ రంగ ప్రవేశము==
ఈవిడ మేనత్త టీఆర్‌ రాజకుమారి 1940వ దశకంలో తమిళంలో అగ్రనటి. ఆమె ‘చంద్రలేఖ’, ‘హరిదాసు’ వంటి సినిమాల్లో నటించారు. ఈవిడ మావయ్య టీ ఆర్‌ రామన్న ప్రముఖ దర్శకుడు. ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. లత, రవిచంద్రన్‌ హీరో హీరోయిన్లుగా ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ పేరుతో తమిళ సినిమా తీస్తుండగా ఓ రోజు టీఏ రామన్‌ ఈవిడ తల్లి వద్దకు వచ్చారు. అందులో హీరోయిన్‌ స్నేహితురాలిగా ఓ పాత్ర వుందని, జయమాలినిని అందులో నటింపజేస్తానని వీళ్ళ అమ్మని అడిగారు. అప్పటికి జయమాలిని వయసు పన్నెండేళ్లు. అదే ఈవిడ తొలిచిత్రం. ఆ సినిమా రిలీజైన తరువాత [[విఠలాచార్య]] ఈమె ఫోటోలను చూసి తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘[[ఆడదాని అదృష్టం]]’ సినిమాలో ఐటమ్‌సాంగ్‌ చేయాలని వీళ్ళ అమ్మని అడిగాడు. అప్పటిలో జయమాలిని చాలాపీలగా వుండడంతో పాటలో నటించేందుకు వీళ్ళ అమ్మ కొంత సందేహించింది. తర్జనభర్జనల తరువాత అమ్మ ఓకే చెప్పింది. అదే జయమాలిని నటించిన తొలి తెలుగు సినిమా.
"https://te.wikipedia.org/wiki/జయమాలిని" నుండి వెలికితీశారు