నిజామియా పరిశోధనా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== మంత్రిగారి కోరిక ==
6వ నిజాం నవాబ్ '''మీర్ మహబూబ్ అలీఖాన్''' ఆస్థాన మంత్రి '''నవాబ్ జఫర్ జంగ్‌'''కు ఖగోళ శాస్త్రంపై మక్కువ ఎక్కువ. ఆయన [[ఇంగ్లాండ్]]లో చదువుకున్నాడు. 15 అంగుళాల గ్రబ్ రిఫ్రాక్టర్‌ను ఇంగ్లాండ్ నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఒక పెద్ద ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీగా నెలకొల్పాలని ప్రతిపాదించాడు. ఈ మేరకు ఆనాటి ఆరో నిజాంకు 1901 సెప్టెంబర్ 29న ఒక లేఖ రాశాడు. మీరు కనుక అనుమతిస్తే హైదరాబాద్‌లో మీ పేరు మీద ‘నిజామియా అబ్జర్వేటరీ’ నెలకొల్పాలని తాను భావిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. నిజాం వెంటనే అంగీకరిస్తూ ఫర్మానా విడుదల చేశాడు.
 
తర్వాత, నవాబ్ జఫర్‌జంగ్ హైదరాబాద్‌కు ఆగ్నేయంగా పిసల్‌బండలో తన సొంత ఎస్టేట్‌లో సంస్థని నెలకొల్పాడు.