రూప్‌నగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
==రూపర్==
సట్లైజ్ నది ఏడమ తీరంలో 21 మీ ఎత్తున శివాలిక్ పర్వతసామీపంలో ఉన్న మట్టిదిబ్బ పేరు. రూపర్. ఇది 6 సంస్కృతులకు సాక్ష్యంగా నిలిచింది.ఈ జిల్లాలో డాక్టర్ వైడి శర్మ పురాతత్వపరిశోధనలు సాగించాడు. హరప్పన్ నుండి రూపర్‌కు వలసలు సరస్వతి మరియు సట్లైజ్ నది మీదుగా సాగాయి.
=== ఆరంభకాలంపురాతన కాలం 1 ===
రూపర్ వద్ద జరిగిన త్రవ్వకాలలో ఆరంభకాల సింధు నాగరికతకు చెందిన అనేక ఆధారాలు లభించాయి. సింధునాగరికతకు సంబంధించిన లిపి, ముద్రలు ఉన్న వస్తువులు, మట్టిని కాల్చి చేసిన టెర్రకోటా వస్తువులు, చెర్ట్ బ్లేడ్లు, రాగి వస్తువులు, టెర్రకోటా పూసలు మరియు గాజులు మరియు సింధునాగరికతకు చెందిన సాధారణ మట్టిపాత్రలు లభించాయి. మొత్తం హరప్పన్ పట్టణాలు మరియు గ్రామాలలో ఇవి పుష్కలంగా లభించాయి.
* మరణించిన వారిని ఖననం చేసే సమయంలో తలను ఉత్తరం వైపు ఉంచి సమాధిపాత్రలలో ఖననం చేస్తారు. ఈ సమాధిపాత్రలు హరప్పా (సింధ్ (పాకిస్థాన్) వద్ద జరిపిన త్రవ్వకాలలో వెలుపలికి తీయబడ్డాయి. హరప్పన్లు ఈ ప్రాంతాన్ని విసర్జించిన కారణం మాత్రం అర్ధం కాలేదు.
"https://te.wikipedia.org/wiki/రూప్‌నగర్_జిల్లా" నుండి వెలికితీశారు