దానిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
==సాగు==
దానిమ్మ సాగుకు తేమ లేని పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం, నీరు నిలవని గట్టి గలస నేలలు అవసరం. చుట్టుప్రక్కల చెరువులు గాని, నదులు గాని, వరి పొలాలు గాని ఉన్న దానిమ్మతోటల్లో ఎక్కువ చీడపీడల ప్రభావం ఉంటుంది. దానిమ్మకు సాధారణంగా 2.50 అంగుళాల బోరు నీరు సరిపోతుంది. అందువల్ల దానిమ్మ రైతులు సాధారణంగా నీటి కరవు ఉన్న అటవీ ప్రాంతాలను ఎంచుకుంటారు. అంటు మొక్క నాటిన 18 నెలలకు పుష్పించి ఫలాలు ఇస్తాయి. ఒక్కొక్క దానిమ్మ మొక్క సగటున 2 నుండి 10 లీటర్ల నీరును పీల్చుకుంటుంది. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీరు తెప్పించాల్సివుంటుంది. ఎరువులు - కలుపు - పురుగు మందుల యాజమాన్యం సకాలంలో ఉండాలి. చుట్టు ప్రక్కల ఇతర పంటలు ఉన్నా దానిమ్మకు వైరస్ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ. మొక్కలు నాటిన మొదటిలో [[బొప్పాయి]] అంతర పంటగా వేస్తారు. వరుసగా సుమారు 5 సంవత్సరాలకు మించి దానిమ్మ ఒకే చోట సాగు చేయడం మంచిది కాదు. సముద్ర తీర ప్రాంతాలు, నదీతీర ప్రాంతాలు దానిమ్మ సాగుకు ప్రతికూలం.
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/దానిమ్మ" నుండి వెలికితీశారు