ఉప్పలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

{{అనువాదం}} తొలగించి, విస్తరణ మూస ఉంచాను
పంక్తి 26:
==బాల్య జీవితం==
శ్రీనివాస్ [[ఫిబ్రవరి 28]], [[1969]], [[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని [[పాలకొల్లు]] లో జన్మించాడు.<ref name=Allmusic>{{cite web|last=Hunt|first=Ken|title=U. Srinivas - Biography|publisher=Allmusic|url=http://www.allmusic.com/artist/u-srinivas-p34614|accessdate=2009-06-02}}</ref> ఆరు సంవత్సరాల వయసులోనే తండ్రి సత్యనారాయణ గారి మాండొలిన్ ను చేతబట్టాడు. కొడుకులోని కళాతృష్ణను టాలెంట్ నుగుర్తించిన తండ్రి తన గురువైన [[:en:Rudraraju Subbaraju|రుద్రరాజు సుబ్బరాజు]] గారి దగ్గర శిష్యరికానికి పంపాడు. రుద్రరాజుగారికి మాండొలిన్ వాయించడం రాదు గాని మంచి గాయకుడు. తన గానకళతో శ్రీనివాస్ కి మాండొలిన్ నేర్పించాడు. శ్రీనివాస్ సోదరుడు యు.రాజేష్ కూడా అన్నకి సంగీతంలో తోడుగా ఉండేవాడు. కర్ణాటక సంగీతంలో మాండొలిన్ ను ఉపయోగించిన ప్రధమ కళాకారుడు శ్రీనివాస్. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్ ను మలచాడు శ్రీనివాస్.
 
 
ఉప్పలపు శ్రీనివాస్‌ బాల సంగీత మేధావి. ఆరేళ్ల వయసులో సంగీత అభ్యాసనకు శ్రీకారం చుట్టాడు. 19వ సంతసరంలో మాండలిన్‌ వాద్య కచ్చేరీ చేసాడు. శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరిజిల్లా పాలకొల్లులో 1969 ఫిబ్రవరి 28న జన్మించాడు. తండ్రి సత్యనారాయణ క్లారినేట్‌ వాద్యకారుడుకాగా, తమ్ముడు రాజేష్‌ మాండలిన్‌ వాయిద్య కళాకారుడు. వీరికి ఒక సోదరి ఉంది.
 
చిన్నతనంలోనే శ్రీనివాస్‌లోని సంగీత జిజ్ఞాసను తండ్రి గమనించి, సంగీతోపాధ్యాయుడు రుద్రరాజు సుబ్బరాజు వద్ద సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. శ్రీనివాస్‌ తొమ్మిదేళ్ల వయసులోనే [[1978]]లోఆంధ్రరాష్ట్రంలో మాండలిన్‌ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశాడు. మద్రాసులో జరిగిన సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా శ్రీనివాస్‌ మాండలిన్‌ వాయుద్య కచ్చేరీని ఏర్పాటు చేశారు. తరువాత ఆయన మన దేశంలోనే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా మొదలగు పలు దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనివాస్‌ వుద్యుత్తు వాద్యాలను వాయిస్తూ కర్ణాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
== కలిసి పనిచేసిన కళాకారులు ==
విదేశీ వెస్ట్రన్‌ సంగీత కళాకారులు మైఖేల్‌బ్రూక్‌, జాన్‌ మెర్‌ లాగ్లిన్‌, నైగెల్‌ కొండి టైగన్‌, మైఖేల్‌ వైమన్‌ వంటి వారితో కలసి విదేశాలలో పలు ప్రోగ్రామ్‌లు చేశాడు. శ్రీనివాస్‌ కర్నాటక సంగీతంతోబాటు హిందుస్థానీ సంగీతంలోను ప్రావీణ్యం గడిరచాడు. హిందుస్థానీ క్లాసికల్‌ సంగీత కళాకారులు హరిప్రసాద్‌, చౌరసియా, జాకీర్‌హుస్సేన్‌ వంటి వారితో కలసి పని చేసాడు.
== అవార్డులు ==
అతి పిన్న వయసులోనే మాండలిన్‌ శ్రీనివాస్‌ను (1998లో) పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నాడు.1983లోనే బెర్లిన్‌లో జరిగిన బజ్‌ ఫెస్టివల్‌లో శ్రీనివాస్‌ మాండలిన్‌ వాదన ఆహూతుల్ని అలరించింది. అత్యంత గౌరవప్రదమైన సంగీత రత్న అవార్డును శ్రీనివాస్‌ గెలుచుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడుగా పదవి నలంకరించాడు. సనాతన సంగీత పురస్కార్‌, రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డు, నేషనల్‌ సిటిజన్‌ అవార్డు, రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ అవార్డు వంటి పలు అవార్డులు శ్రీనివాస్‌కు అలంకారం అయ్యాయి. శ్రీనివాస్‌ పలు కర్నాటక సంగీత ఆల్బమ్‌లు రూపొందించాడు.
==మరణం==
ఉప్పలపు శ్రీనివాస్‌(45) (మాండలిన్) శుక్రవారం చెన్నైలో కన్నుమూసాడు. చెన్నై అపొలో హాస్పిటల్ లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం 19.9.2014 మరణించారు.<ref>http://www.thehindu.com/news/national/tamil-nadu/obituary-mandolin-u-shrinivas/article6426381.ece</ref>కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాండలిన్‌ శ్రీనివాస్‌ ఈనెల మూడవ తారీఖున చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈయనకు కాలేయం చెడిపోవడంతో వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స అందించినప్పటికీ, అది ఫలించకపోవడంతో శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాండలిన్‌ శ్రీనివాస్‌ తుదిశ్వాస విడిచాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఉప్పలపు_శ్రీనివాస్" నుండి వెలికితీశారు