ఉప్పలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==బాల్య జీవితం==
శ్రీనివాస్ [[ఫిబ్రవరి 28]], [[1969]], [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[పాలకొల్లు]] లో జన్మించాడు.<ref name=Allmusic>{{cite web|last=Hunt|first=Ken|title=U. Srinivas - Biography|publisher=Allmusic|url=http://www.allmusic.com/artist/u-srinivas-p34614|accessdate=2009-06-02}}</ref> ఆరు సంవత్సరాల వయసులోనే తండ్రి సత్యనారాయణ గారి మాండొలిన్ ను చేతబట్టాడు. కొడుకులోని కళాతృష్ణను టాలెంట్ నుగుర్తించిన తండ్రి తన గురువైన [[:en:Rudraraju Subbaraju|రుద్రరాజు సుబ్బరాజు]] గారి దగ్గర శిష్యరికానికి పంపాడు. రుద్రరాజుగారికి మాండొలిన్ వాయించడం రాదు గాని మంచి గాయకుడు. తన గానకళతో శ్రీనివాస్ కి మాండొలిన్ నేర్పించాడు. శ్రీనివాస్ సోదరుడు యు.రాజేష్ కూడా అన్నకి సంగీతంలో తోడుగా ఉండేవాడు. కర్ణాటక సంగీతంలో మాండొలిన్ ను ఉపయోగించిన ప్రధమ కళాకారుడు శ్రీనివాస్. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్ ను మలచాడు శ్రీనివాస్.
 
== బాలమేధావిగా ప్రతిభ ==
ఉప్పలపు శ్రీనివాస్‌ బాల సంగీత మేధావి. ఆరేళ్ల వయసులో సంగీత అభ్యాసనకు శ్రీకారం చుట్టాడు. 19వ సంతసరంలో మాండలిన్‌ వాద్య కచ్చేరీ చేసాడు. శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరిజిల్లా పాలకొల్లులో 1969 ఫిబ్రవరి 28న జన్మించాడు. తండ్రి సత్యనారాయణ క్లారినేట్‌ వాద్యకారుడుకాగా, తమ్ముడు రాజేష్‌ మాండలిన్‌ వాయిద్య కళాకారుడు. వీరికి ఒక సోదరి ఉంది. శ్రీనివాస్‌ తొమ్మిదేళ్ల వయసులోనే [[1978]]లోఆంధ్రరాష్ట్రంలో మాండలిన్‌ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశాడు. మద్రాసులో జరిగిన సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా శ్రీనివాస్‌ మాండలిన్‌ వాయుద్య కచ్చేరీని ఏర్పాటు చేశారు. తరువాత ఆయన మన దేశంలోనే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా మొదలగు పలు దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనివాస్‌ వుద్యుత్తు వాద్యాలను వాయిస్తూ కర్ణాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
"https://te.wikipedia.org/wiki/ఉప్పలపు_శ్రీనివాస్" నుండి వెలికితీశారు