హనుమకొండ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Warangal mandals outline11.png|state_name=|mandal_hq=హనుమకొండ|villages=1632|area_total=|population_total=87503|population_male=44999|population_female=42504|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=69.28|literacy_male=80.76|literacy_female=57.15}}
'''హనుమకొండ''' లేదా హన్మకొండ, [[తెలంగాణ ]] రాష్ట్రములోని [[వరంగల్]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి '''అనుముకొండ''' అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. పూర్వకాలం లో ఈ ప్రాంతము జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది.కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది.
[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px| హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది]]
==హన్మకోండలో బతుకమ్మ, దసరా పండుగలు==
 
'''[[హనుమకొండ''']] లేదా [[హన్మకొండ,]] [[తెలంగాణ ]] రాష్ట్రములోని [[వరంగల్]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి '''అనుముకొండ''' అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. పూర్వకాలం లోపూర్వకాలంలో ఈ ప్రాంతము జైన మతజైనమత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది.
హన్మకొండ పట్టణం అయినప్పటికీ బతుకమ్మ, దసరా పండుగలను మాత్రం పల్లెల్లో కంటే గొప్పగా జరుపుకుంటారు. పితృఅమావాస్య (పెత్రమావస్య) తో బతుకమ్మ పండుగ మొదలయ్యి తొమ్మిది రోజుల పాటు రోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకుంటారు. అయితే ఆరవ రోజు మాత్రం బతుకమ్మ ఆడరు.పెత్రమావస్య ముందు రోజు సాయంత్రం నుండి చుట్టుప్రక్కల పల్లెలనుండి తంగేడు, గునుగు, తామర, బంతి, చామంతి మొదలగు పువ్వులను అమ్ముతారు. వీటితో పాటు బతుకమ్మ పేర్చడానికి సిబ్బులు, గుమ్మడిఆకులను కూడా అమ్ముతారు. తిరిగి వీటినన్నింటిని బతుకమ్మ ముందురోజు కూడా అమ్మతారు. బతుకమ్మ మొదటిరోజు నుండి ఎనిమిదోరోజు వరకు అందరు వారి ఇంటిదగ్గరి గుళ్ళల్లో బతుకమ్మ ఆడుతారు. కాని తోమ్మిదోరోజయిన దుర్గాష్టమినాడు సాయంత్రం మాత్రం, పిల్లల నుండి పెద్దలవరకు, ఎన్నడూ ఇంట్లనుండి బయటికి వెళ్ళని వారు కూడా ప్రతిఒక్కరు కొత్తబట్టలు వేసుకొని, వివిధ నగలను ధరించి బతకమ్మలను చేత బట్టుకుని పద్మాక్షమ్మ గుట్టకు పోతారు. బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! బంగారు బతుకమ్మ ఉయ్యాలో!!, రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో !! రామ రామా నంది ఉయ్యాలో ! రాగ మెత్తరాదు ఉయ్యాలో!అని గొంతెత్తి ఒకరు పాడగా మిగతా వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.
బతుకమ్మను సుమారు గంట నుండి రెండు గంటల వరకు ఆడినతర్వాత, బతుకమ్మను నీళ్ళల్లో వదులుతారు. బతుకమ్మతోబాటు సద్దులుకూడా పట్టుకపోతారు. సత్తిపిండి, నువ్వులపొడి, పల్లీలపొడి, కొబ్బరిపొడి మొదలగు వాటిని కలిపి సద్దులు అంటారు. బతుకమ్మను నీళ్ళల్లో వదిలిన తర్వాత సద్దులను అందరు పంచుకుని తిని, పసుపుకుంకుమలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. తిరిగి ఆటోలల్లోగాని, కార్లల్లోగాని ఇంటికి చేరుకుంటారు. అప్పుడు ఎల్లుండి వచ్చే దసరా పండుగగురించి , వచ్చే సంవత్సరం వచ్చే బతుకమ్మ గురించి మాట్లాడుకుంటారు .
 
[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px|]]
బతుకమ్మకు ఒక్కరోజు విరామం తర్వాత వచ్చే దసరా పండుగ, హన్మకొండలో జరుపుకోనే పండుగలలో ప్రధానమైనది, ముఖ్యమైనదికూడా. దసరారోజు ప్రతిఒక్కరు తమ తమ వాహనాలను కడుక్కొని, పూలదండవేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. చేతిపనులవారు తమ పనిముట్లకు, పరిశ్రమలవారు మిషిన్లకు పూజలు చేస్తారు. పోలీస్, మిలిటరీ వాళ్ళుకూడా తమ ఆయుధాలకు పూజచేస్తారు. ఇండ్లకు ముగ్గుపోయడం, గృహప్రవేశాలు, దుకాణాల ప్రారంభం మొదలగు కొత్తపనులను చేస్తారు. బతుకమ్మరోజు కూరగాయల భోజనంచేస్తే, దసరా నాడు మాత్రం అందరు (శాఖాహారులు మినహా) మాంసాహార భోజనం చేస్తారు. పూరీలు, గారెలు చేసుకుంటారు. చాలా మంది మద్యాన్నికూడా సేవిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుండి పురుషులు, స్త్రీలు, పిల్లలందరూ కొత్తబట్టలు వేసుకొని జమ్మి కొరకు పద్మాక్షమ్మగుట్టకు పోతారు. గుట్ట దగ్గరికి పోవడానికి బలమైన కారణముంది. గుట్ట దగ్గరికి వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రతివొక్కరు వస్తారు. తమ చిన్ననాటి మిత్రులను, దోస్తులను కలుస్తారు. జమ్మియాకు తీసుకొని, పాలపిట్టను చూసి, దసరా ఉత్సవ కమిటీవారు ఏర్పాటు చేసిన రావణాసుర వధను చూసి ఇంటికి వస్తారు. గుట్టదగ్గరి నుండి ఇంటికి వచ్చేవరకు, వచ్చినతర్వాత పెద్దలకు, మిత్రులకు జమ్మిఆకూ చేతిలపెట్టి కాళ్ళకుమొక్కి, ఆలింగనం చేసుకుంటారు. కొంత జమ్మియాకును బీరువాలల్లో వేసుకుంటారు. బతుకమ్మ, దసరా పండుగలను మాఊళ్ళోనే బాగా ఘనంగా జరుపుకుంటారు.
 
== శాసనసభ నియోజకవర్గం ==
*పూర్తి వ్యాసం [[హనుమకొండ శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
 
== మండలంలోని పట్టణాలు ==
*హనుమకొండ
 
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ" నుండి వెలికితీశారు