అనురాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
[[రజనీకాంత్‌]], [[శ్రీప్రియ]] నటించిన [[కోకిలమ్మ చెప్పింది]] లో తొలిసారిగా ఈమె వెండితెరపై కనిపించింది. ఈవిడకు అప్పుడు పదేళ్ల వయసు. ఆ సినిమా షూటింగ్‌కి అమ్మతోపాటు ఈవిడా వెళ్ళేది. ఆ సినిమాలో పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించే సన్నివేశం ఒకటి ఉంది.. పిల్లలకు డ్యాన్స్‌ నేర్పిస్తున్న సన్నివేశం తీస్తున్నారు. ఈమె నృత్యం బాగా చేస్తుందని తెలిసి మిగతా పిల్లలతోపాటు ఈమెకూ మేకప్‌ వేయించి, ఆ సన్నివేశంలో నటింపజేశారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఏ సినిమాలో నటించలేదు. ఒక రోజు స్కూలు లేకపోవడంతో ఊర్వశి శారద నటిస్తున్న సినిమా షూటింగ్‌కి వెళ్ళింది. అప్పట్లో వీళ్ళ అమ్మ, శారదగారికి హెయిర్‌డ్రస్సర్‌గా వ్యవహరించేది.
ఈవిడ సెట్‌లో నిల్చుని షూటింగ్‌ చూస్తున్నది. అక్కడే ఉన్న మలయాళం డైరెక్టర్‌ ఒకాయన ఈవిడను చూసి ‘చాలా అందంగా ఉంది. నా సినిమాకి ఇటువంటి అమ్మాయే కావాలి’ అని ఈమె కోసం వాకబు చేశారు. ఆయనే జాతీయ అవార్డు గ్రహీత కేజీ జార్జ్‌. అమ్మానాన్నలు అంగీకరించడంతో హీరోయిన్‌ అయిపోయింది. అప్పుడు ఈవిడకు 13 ఏళ్లు. మలయాళంలో జార్జ్‌ తీసిన ‘ఇని అవళ్‌ఉరంగట్టె’ ఈమె తొలి సినిమా. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌ అది. నటన గురించి ఏమీ తెలియకుండానే అలా హీరోయిన్‌ అయిపోయింది. ఆ సినిమాలో ఏం చేయాలో, ఎలా చేయాలో జార్జే చూసుకున్నారు. ఈవిడ మొదటి సినిమా కథ కూడా ఈవిడకు తెలియదు. ఈ సినిమాలో నటించడానికి ముందు ‘ఈ అమ్మాయి ఓకే... హీరోయిన్‌ ఈమే’ అని చెప్పారంతే. అప్పట్లో తమిళం, మలయాళంలో సులక్షణ అనే మరో నటి ఉండడంతో, కేజీ జార్జ్‌ ఈమె పేరుని అనురాధగా మార్చారు. ఆ తరువాత తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. 30కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. తెలుగులో [[చంద్రమోహన్‌]]తో [[పంచకల్యాణి]], [[రంగనాథ్‌]]తో 'ఊరు నిద్ర లేచిందీ... ఇంకా కొన్ని సినిమాలు చేసింది. కానీ ‘ఊరు నిద్ర లేచింది’ విడుదల కాలేదు. అందులో ఈవిడది జట్కా బండి నడిపే అమ్మాయి పాత్ర . పేరు ‘పంచకల్యాణి. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.
==శృంగార నర్తకిగా ప్రస్థానము==
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/అనురాధ_(నటి)" నుండి వెలికితీశారు