గద్వాల కోట: కూర్పుల మధ్య తేడాలు

చి కోటలో సినిమా షూటింగ్‌లు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
== కోట చారిత్రక నేపథ్యం ==
రాజా పెదసోమభూపాలుడు (నలసోమనాద్రి) పూడూరు రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు ధుర్భేధ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో గద్వాలలో మట్టి కోటను కట్టించాడు. కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు రావడముతో కేశవాచారి అనే బ్రాహ్మణుడిని బలి ఇచ్చారని, ఆ పాప పరిహారానికి గాను గద్వాల కోటలో చెన్నకేశవ దేవాలయాన్ని నిర్మించారని కథ ప్రచారంలో ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన తరువాత రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చినాడు. పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్దంలో పెదసోమభూపాలుడు కూడా పాల్గొని గదను, వాలమును ప్రయోగించడము వలన ఈ ప్రాంతానికి "గదవాల(గద్వాల)" అన పేరు వచ్చినదని చెబుతారు<ref> ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 32 </ref>. ఆవిధంగా ఈ కోట గద్వాల కోటగా చరిత్రలో మిగిలిపోయింది. 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశుల ఆధీనంలో ఉండిన ఈ కోట, సంస్థానాల రద్దు తరువాత ప్రభుత్వ పరమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరువాత 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను ఈ కోటలోపల ఏర్పాటు చేసింది. డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (మాల్డ్)డిగ్రీ కళాశాలగా పెట్టబడింది. గద్వాల సంస్థానాధీశులు సాహితీప్రియులు కావడంతో కోటలో తరుచుగా సాహిత్య సభలు జరిగేవి. కవులకు సంస్థానాధీశులు బహుమతులను కూడా అందజేసేవారు. చినసోమభూపాలుని హయంలో అష్టదిగ్గజాలనే 8మంది కవులుండేవారు<ref> గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-39</ref>.. వీరి కాలంలో సాహిత్యం బాగా అభివృద్ధి చెందినది. అందుకే గద్వాలకు ''విద్వద్గద్వాల '' అని పేరు. తిరుపతి వేంకట కవులు కూడా గద్వాల సంస్థానాన్ని సందర్శించారు.
== కోటలో సినిమా షూటింగ్‌లుచిత్రీకరణలు ==
గద్వాల కోటలో [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో మెగాస్టార్ [[చిరంజీవి]] నటించిన [[కొండవీటి రాజా]] అను తెలుగు చిత్రం షూటింగ్ జరిగింది. గద్వాల ప్రాంతానికి చెందిన సినీ ఫైనాన్‌సియర్, నిర్మాత బుర్రి వెంకట్రామిరెడ్డి నిర్మాణంలో ఈ చిత్రం వచ్చింది. దాదాపు నెలరోజులకు పైగా గద్వాల కోటలో షూటింగ్సినిమా చిత్రీకరణ జరిగింది. కోట చుట్టూ ఉండిన కందకంలో, కోటలోపలి బావి దగ్గర ఫైటింగ్‌లు, కోటలోపల ఆలయ సముదాయంలో ''అంగాంగ వీరాంగమే '' పాట చిత్రీకరణ జరిగింది. దాదాపు సినిమా చివరి ఘట్టాలనిఘట్టాలన్నీ కోటలో చిత్రీకరించబడినవే.
==ఇవి కూడా చూడండి==
*[[గద్వాల సంస్థానము]]
"https://te.wikipedia.org/wiki/గద్వాల_కోట" నుండి వెలికితీశారు