భువనగిరి కోట: కూర్పుల మధ్య తేడాలు

/* చరిత్ర
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
భువనగిరి పరిసరాల్లోని తుమ్మలగూడెం, వలిగొండ,రాయగిరి వంటి చోట్ల మధ్యపాతరాతియుగం (క్రీ.పూ. 50000-10000)నాటి మానవ ఆవాస చిహ్నా లున్నాయి. రాతిగొడ్డళ్ళు, కత్తులు, బొరిగెలు,బాణాలు వంటి రాతిపనిముట్లు లభించాయి. సమాధులు కూడా కనుగొనబడ్డాయి.
భువనగిరిలో మధ్యరాతియుగం (క్రీ.పూ. 10,000- 2000) నాటి మానవనివాసజాడలు లభించాయి.
నవీనశిలాయుగం (క్రీ.పూ.2500-1000) నాటి మానవ ఆవాసాలు భువనగిరికొండ కింద చాలా వున్నాయి.
భువనగిరిలో రైలుకట్ట వెంట దిగువకు రాయగిరి దాకా, పైకి బీబీనగర్ పై వరకు అక్కడక్కడ సిస్తులు, కైరన్లు అగుపిస్తున్నవి. వీటిని పరిశోధిస్తే ఇంకా కొత్త చారిత్రక విషయాలు బహిర్గతమయే అవకాశముంది.
భువనగిరికి దగ్గరగా ఆలేరునది(భిక్కేరు), మూసీనదులున్నాయి. భువనగిరికి వాయవ్యాన భువనగిరి చెరువుంది. చెరువుకు బీబీనగర్ చెరువు గొలుసుకట్టు చెరువు. అక్కడనుండి కట్టుకాలువ వుంది.
"https://te.wikipedia.org/wiki/భువనగిరి_కోట" నుండి వెలికితీశారు