అంగదుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
 
[[కుంభకర్ణుడు]] యుద్ధం చేసేటపుడు వానరసేన కకావికలై పోతుండగా వారికి ధైర్యం చెప్పి అంగదుడు యుద్ధానికి ప్రోత్సహించాడు. స్వయంగా కుంభకర్ణుని నిలువరించడానికి ప్రయత్నించాడు. అంగదుడి పిడి దెబ్బకు కుంభకర్ణుడు మూర్ఛిల్లాడు కాని అంతలోనే తేరుకొని అంగదుడిని ఒక్కపోటు పొడిచాడు. దానితో అంగదుడు తెలివి తప్పిపడిపోయాడు. తరువాత కుంభకర్ణుడు రామలక్ష్మణుల బాణాలతో మరణించాడు. కుంభకర్ణుడి మరణం తరువాత [[త్రిశిరుడు]], [[దేవాంతకుడు]], [[నరాంతకుడు]], [[అతికాయుడు]] వంటి మహారాక్షస వీరులు యుద్ధానికి బయలుదేరారు. వారిలో నరాంతకుడు అంగదునితో భీకరమైన యుద్ధం చేసి అంగదునిచేత మరణించాడు. ఇంద్రజిత్తు మరణం తరువాత యుద్ధానికి వచ్చిన మహాపార్శ్వుడు కూడా అంగదునిచేతనే మరణించాడు. రామ రావణ సంగ్రామం లో అంగదుడు వీరోచితం గా పోరాడి రాక్షస మూక ను చీల్చి, చెండాడాడు .రావణ సేనాధి పతిని మహా కాయుడిని అంగదుడు హత మార్చాడు ..సైన్యం బలహీనమై పోతుండగా రావణుడు మహా హోమం చేయటం ప్రారంభించాడు .ఇది తెలుసుకొన్న రాముడు అంగదుడు మొద లైన వారిని హోమ భంగం చేయమని పంపాడు . రావణుని అంతఃపురానికి వెళ్ళిన అంగదుడు అతిగా దుఃఖిస్తున్న రావణ పత్ని మండోదరి జుట్టు పట్టుకొని ఈడ్చి తెచ్చి రావణుని ముందు పడేశాడు .విచలితుడైన రాక్షస రాజు హోమం మానేసి భార్యను రక్షించుకో వాలన్న తపన తో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు .రావణ సంహారం అయిన తర్వాతా సుగ్రీవుడు శ్రీ రాముని తో అయోధ్యకు వెళ్లాడు అప్పుడు అంగదుడే కిష్కింధకు రాజైనాడు .
 
 
"https://te.wikipedia.org/wiki/అంగదుడు" నుండి వెలికితీశారు