"గోవిందుడు అందరివాడేలే" కూర్పుల మధ్య తేడాలు

ముఖ్యసవరణలు చేసాను
(సినిమా పంపిణీకి సంబంధించిన వివరాలను జతచేసాను)
(ముఖ్యసవరణలు చేసాను)
}}
 
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై [[బండ్ల గణేష్]] నిర్మాణంలో [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుటుంబకథా చిత్రం "'''గోవిందుడు అందరివాడేలే'''". ఈ సినిమాలో [[రాం చరణ్ తేజ]], [[మేకా శ్రీకాంత్|శ్రీకాంత్]], [[కాజల్ అగర్వాల్]], [[కమలినీ ముఖర్జీ]] కథానాయక-నాయికలుగా నటించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/govindhudu-andhari-vadele-confirmed-for-charan.html|title=‘గోవిందుడు అందరి వాడేలే’ అంటున్న రామ్ చరణ్|publisher=123తెలుగు.కామ్|date=27 March 2014|accessdate=27 March 2014}}</ref><ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/ram-charan-vamsi-s-film-will-be-family-drama-130110.html|title=మహేష్ హిట్ చిత్రం టైప్ కథతో రామ్ చరణ్|publisher=వన్ఇండియా|date=10 February 2014|accessdate=16 March 2014}}</ref> [[ప్రకాశ్ రాజ్|ప్రకాష్ రాజ్]], [[జయసుధ]], రహమాన్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రకథను [[పరుచూరి వెంకటేశ్వరరావు]], [[పరుచూరి గోపాలకృష్ణ]] రచించారు. [[యువన్ శంకర్ రాజా]] సంగీతాన్ని అందించారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకునిగా, నవీన్ నూలి ఎడిటరుగా పనిచేసారు. ఈ సినిమా కథకు పాక్షికంగా [[అక్కినేని నాగేశ్వరరావు]], [[మీనా]] కలిసి నటించిన ''[[సీతారామయ్య గారి మనవరాలు]]'' స్పూర్తి.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/Artical.aspx?SID=27781&SupID=24|title=ప్రకాశ్‌రాజ్‌ ఈ కాలపు ఎస్వీఆర్‌|publisher=ఆంధ్రజ్యోతి|date=29 September 2014|accessdate=30 September 2014}}</ref>
 
ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరి 6, 2014న హైదరాబాదులో మొదలయ్యింది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/hindi/article/102215.html|title=చరణ్ సినిమా ముహూర్తం|publisher=ఇండియాగ్లిట్స్|date=13 January 2014|accessdate=16 March 2014}}</ref> అదే రోజు మొదలైన ఈ సినిమా చిత్రీకరణ భారతదేశంలో హైదరాబాదు, రామేశ్వరం, నాగర్ కోయిల్, పొల్లాచి, కన్యాకుమారి, కేరళ, కారైకుడి ప్రాంతాల్లో జరుపబడింది. విదేశాల్లో లండన్, జోర్డాన్ నగరాల్లో ఈ సినిమాలోని కొంత భాగం చిత్రీకరించబడింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1, 2014న ఉదయం 5:18 గంటలకు విడుదలవుతోంది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/muhurat-set-for-gav.html|title=ఉదయం 05.18 గంటలకు ‘గోవిందుడు..’గా రామ్ చరణ్.|publisher=123తెలుగు.కామ్|date=25 September 2014|accessdate=27 September 2014}}</ref>
===అభివృద్ధి===
ఆగస్ట్ 2013లో [[రాం చరణ్ తేజ]], [[దగ్గుబాటి వెంకటేష్]], [[ఘట్టమనేని కృష్ణ]] కలిసి [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో ఒక కుటుంబ కథాచిత్రంలో నటించనున్నారని, ఆ సినిమాని [[బండ్ల గణేష్]] పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పోతాకంపై నిర్మిస్తారని వార్తలొచ్చాయి.<ref name="origin">{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/2013/08/another-multi-starrer-with-ram-charan-120588.html|title=రామ్ చరణ్ తో మరో మల్టిస్టారర్...డిటేల్స్|publisher=వన్ఇండియా|date=8 August 2013|accessdate=16 March 2014}}</ref> ఆ తర్వాత [[దసరా]]కి సినిమాని లాంచ్ చెయ్యాలనుకున్నా సినిమా స్క్రిప్ట్ పూర్తిగా తయారయ్యేదాకా ఆగాలని భావించారు. ఆపైన ఈ సినిమా ఆగిపోయిందనుకున్న తరుణంలో బండ్ల గణేష్, కృష్ణవంశీ, చాయాగ్రాహకుడు సమీర్ రెడ్డి [[అంతర్వేది]] లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూర్తి స్క్రిప్ట్ చేతపట్టుకుని కనబడటం ఈ సినిమా మొదలవుతుందన్న వాదనను దృవీకరించింది.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/node/41448|title=అంతర్వేది ఆలయంలో సినీ ప్రముఖుల సందడి
|publisher=[[ఆంధ్రజ్యోతి]]|date=12 December 2013|accessdate=16 March 2014}}</ref> జనవరి నెలచివరలో ఈ సినిమా పేరును "గోవిందుడు అందరివాడేలే" అని ఖరారు చేసినట్లుగా వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/ram-charan-krishna-vamsi-movie-title-govindudu-andarivadele-99194|title=గోవిందుడు అందరి వాడేలే?|publisher=[[సాక్షి (దినపత్రిక)|సాక్షి దినపత్రిక]]|date=22 January 2014|accessdate=16 March 2014}}</ref> కానీ వాటిని కృష్ణవంశీ ఖండించారు. "నేను ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని ఫైనలైజ్ చెయ్యలేదు. మేము చాలా టైటిల్స్ ని చూస్తున్నాం. వేరే వేరే టైటిల్స్ ని దయచేసి ప్రచారం చేయొద్దు. టైటిల్ ఫైనలైజ్ అయ్యాక మేము అధికారికంగా తెలియజేస్తామని" కృష్ణవంశీ అన్నారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/krishna-vamsi-rejects-title-rumours.html|title=పుకార్లను కొట్టిపారేసిన కృష్ణ వంశీ|publisher=123తెలుగు.కామ్|date=23 January 2014|accessdate=16 March 2014}}</ref> రధసప్తమి పర్వదినాన ఫిబ్రవరి 6, 2014న ఫిల్మ్ నగర్ వెంకటేశ్వరస్వామి దేవాలయలంలో ఈ సినిమాని అధికారికంగా ప్రారంభించారు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/103166.html|title=చరణ్ - కృష్ణవంశీ ల చిత్రం షురూ|publisher=ఇండియాగ్లిట్స్|date=6 February 2014|accessdate=16 March 2014}}</ref> చిత్రీకరణ జరుగుతుండగా [[చిరంజీవి]] నటించిన సినిమాల జాబితాను పరిశీలనలోకి తీసుకుని వాటితో పాటు ఏదయినా ఒక తెలుగు టైటిలును పెట్టాలని కృష్ణవంశీ ఆలోచిస్తున్నారని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://telugu.gulte.com/tmovienews/3886/Ram-charan-First-look-in-Krishna-Vamsi-Movie|title=చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుందో?|publisher=గల్ట్.కామ్|date=12 March 2014|accessdate=16 March 2014}}</ref> ఆపై చిరంజీవి నటించిన విజేత సినిమా టైటిలును దీనికి పెట్టాలనుకుంటున్నారని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.andhraprabha.com/cinema/box-office/ramcharan-as-vijetha/13841.html|title='విజేత'గా.. రామ్ చరణ్|publisher=[[ఆంధ్రప్రభ]]|date=13 March 2014|accessdate=16 March 2014}}</ref> సాంప్రదాయమైన, కుటుంబకథా చిత్రంగా ఈ పేరు ధ్వనిస్తున్నట్టు కృష్ణవంశీ భావించడంతో గోవిందుడు అందరివాడేలే పేరుని ఖరారు చేసినట్టుగా వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.prajasakti.com/index.php?srv=10301&id=1069508&title=%E0%B0%97%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%A1%E0%B1%81%20%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%87%E0%B0%B2%E0%B1%87..|title=గోవిందుడు అందరివాడేలే..|publisher=[[ప్రజాశక్తి]]|date=16 March 2014|accessdate=17 March 2014}}</ref><ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/goivindudu-andarivadele-cherry-vamsi-s-movie-title-132865.html|title=రామ్ చరణ్,కృష్ణవంశీ చిత్రంకి టైటిల్ ఖరారు|publisher=వన్ఇండియా|date=27 March 2014|accessdate=27 March 2014}}</ref> ఈ సినిమాను దివంగత దర్శకుడు [[బాపు]] కు అంకితం ఇవ్వలన్న అభిప్రాయాన్ని యూనిట్ సభ్యులతో కృష్ణవంశీ చెప్పగా బాగుంటుందని వారు కూడా భావించడంతో బాపు చిత్రపటాన్ని ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో చేర్చారు.<ref>{{cite web|url=http://www.teluguone.com/tmdb/news/govindudu-andarivadele-tribute-to-bapu-tl-38715c1.html|title='గోవిందుడు అందరి వాడేలే' బాపుకు అంకితం|publisher=తెలుగువన్|date=25 September 2014|accessdate=25 September 2014}}</ref> దీని గురించి మాట్లాడుతూ కృష్ణవంశీ "అంకితం అంటే పెద్ద మాట అవుతుందేమో? ఆయనకు అంకితం చేయగల గొప్పవాళ్లం కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముంగిట 'ముత్యాల ముగ్గు' వేసిన పద్మశ్రీ బాపుగారికి వినమ్రతతో మీ ఏలకవ్య శిష్యబృందం'' అంటూ సినిమా ప్రారంభంలోనే టైటిల్‌ కార్డ్‌ వేస్తున్నాం. అలా బాపును గుర్తుచేసుకొంటున్నాము" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://telugu.filmibeat.com/news/govindudu-andarivadele-movie-goes-bapu-041319.html|title=బాపుకి అంకితమిస్తున్నారు|publisher=వన్ఇండియా|date=30 September 2014|accessdate=30 September 2014}}</ref> సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ చరణ్ "గోవిందుడు అందరివాడేలే అనేది క్యారెక్టర్‌ గురించి పెట్టింది. ఆ పేరు గల వ్యక్తి అందరివాడు అనే అర్థం. అందరినీ కలుపుకొనే తత్త్వం వున్నవాడు. కానీ నా పేరు గోవిందుడు కాదు" అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/interview/ram-charan-interview-114092900092_1.html|title=దసరాకు దూకుతున్నాం... 8 సెంటిమెంట్ అధిగమిస్తా... రాంచరణ్ ఇంటర్వ్యూ|publisher=వెబ్ దునియా|date=29 September 2014|accessdate=30 September 2014}}</ref>
 
===నటీనటుల ఎన్నిక===
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1302088" నుండి వెలికితీశారు