"సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
జిల్లా వరుస సంఖ్య : 10
శాసనసభ వరుస సంఖ్య : 116
 
==పూర్వచరిత్ర==
 
రాష్ట్రంలోని నియోజకవర్గాలలో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం వుంది. విభిన్న సంస్తృతుల గుమ్మంగా రాజకీయ చిత్రపటంలో చోటు కలిగి వుంది. తూర్పు, పశ్చిమ కృష్ణాజిల్లాలకు సరిహద్దుగానూ ఖమ్మం జిల్లాకు మొదటి నియోజక వర్గంగా ఏర్పడింది. సత్తుపల్లి ప్రజలకు పక్కజిల్లాల సంస్తృతి, సంప్రదాయాలతో తగినంత సత్సంభందాలను కలిగివుంటుంది. 1952 వరకు వేంసూరు నియోజకవర్గంగా వున్న ఈ ప్రాంతం ఆ తరువాత నైసర్గిక స్వరూపం ప్రాతిపదిక ఆధారంగా సత్తుపలి నియోజకవర్గంగా ఏర్పడింది. భౌగోళికం గానూ, చార్రితకంగానూ, రాజకీయం గానూ మొదటినుంచి ప్రత్యేకతలను చాటుకుంటోంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వరకు నియోజకవర్గ చరిత్ర స్పూర్తిదాయకంగా వుంటుంది. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల సమ్మేళనంతో అధికశాతం అటవీ ప్రదేశం కలిగిన నియోజకవర్గంగా వుంది. స్వాతంత్య్ర, తెలంగాణ సాయుధ పోరాటాల్లోనూ కీలకపాత్ర పోషిం చినవారు నియోజక వర్గంలో వుండటం విశేషం. నియోజకవర్గానికి తూర్పున పశ్చిమగోదావరి, ఉత్తరం కృష్ణా, పడమర మధిర నియోజకవర్గం, దక్షిణ కొత్తగూడెం నియోజకవర్గం సరిహద్దులుగా వున్నాయి. పరిశ్రమల స్థాపనకు మెరుగైన అవకాశాలు వున్నాయి. ఓపెన్‌కాస్టు బొగ్గుగనుల తవ్వకాలు ఇప్పటికే ముమ్మరంగా నడుస్తున్నాయి ధర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా దేశంలో గుర్తింపు పొందిన సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు గణనీయమైన అభివృద్ధి చేశారు.
 
==నియోజకవర్గంలోని మండలాలు==
* [[పెనుబల్లి]]
* [[కల్లూరు]]
* [[వెంసూరు]]
* [[వెముసూరు]]
 
== నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1302432" నుండి వెలికితీశారు