బలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విక్షనరి వ్యాసం}}
{{అయోమయం}}
'''బలి''' అనగా దైవప్రీతి కోసం ఏదో ఒక జీవాన్ని చంపే ఒక క్రతువు.బలి ఎందుకు?బలులు అవసరమా అనవసరమా అనే విషయంపై రకరకాల వాదాలు వివరణలూ ఉన్నాయి..
==బలి కావాలి==
జంతు బలులు వైదిక ప్రామాణికాలు, బలులకు చాలా ప్రాథాన్యం ఉంది.కానీ ఇప్పటి వైదిక పురోహితులు బౌద్ధ,క్రైస్తవ ప్రభావంలో పడి బలులు ఆచరించడం లేదు.ఏయే క్రతువుల్లో జంతు బలి అవసరమో ఆయా క్రతువుల్లో ఏయే దేవతలకి ఏబలి అవసరమో ఆయా దేవతలకు ఆయా జంతుమాంసాలని ఇప్పటికీ సమర్పిస్తూనే ఉన్నారు.కొన్ని దేవతల్ని సంతృప్తిపఱచడానికి నరబలి కూడా చెయ్యాలి. మన దృష్టిలో మనం మనుషులం.కానీ దేవతల దృష్టిలో మనం అన్ని జంతువుల లాంటివాళ్ళమే. మన దృష్టిలో జంతువులు ఏ విధంగానైతే తినదగినవో, అదే విధంగా ఆ దేవతల దృష్టిలో మన ప్రాణశక్తి కూడా హరించదగినదే. ప్రాజెక్టులూ, సినిమాహాళ్ళూ, ఫ్యాక్టరీలూ వంటి పెద్దపెద్ద కట్టడాలు కట్టినప్పుడు ఇప్పటికీ నరబలిని ఆచరిస్తున్నారు. అందుకోసం అంగవైకల్యాలు లేని అబ్బాయిల్ని,పెళ్ళికాని, కన్యలను బలి ఇస్తారు.
దసరా,బక్రీదు లాంటి పండుగలలో కూడా విస్తారంగా బలులిస్తున్నారు.ఎందుకంటే అలా బలైన జంతువులకు పుణ్యఫలం దక్కుతుంది.బలి ఇచ్చినవారి విదేయతకు మెచ్చి దైవం కరుణిస్తుంది.మహానైవేద్యం లో అన్నాన్ని అగ్నిలో వేల్చడం ద్వారా మేఘ సంవర్ధనం జరిగి సకాలంలో వర్షాలు కురుస్తాయి.అదృశ్యశక్తులు మాంసప్రియులు. శాస్త్రోక్తంగా కర్మకాండ మొత్తం నిర్వహించినప్పుడు వారు ఆ బలుల్ని స్వీకరించి మానవుల కోరికలు తీఱుస్తారు.
==బలి వద్దు==
ఎన్నో రకాల జంతువులు మన దేవుళ్ళకు వాహనాలు.వాటిని బలి ఇవ్వకూడదు.ఏరువాక పున్నమికి జంతువులను పూజిస్తారు.బుద్ధుడు,శంకరాచార్యులు,క్రీస్తు,జైనులు,పతంజలి .. బలులు వద్దన్నారు.బలులన్నీ నిరర్ధక హత్యలే.బలులు మాని ఉపవాసాలు చెయ్యటం ఉత్తమం.విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి.బలి కంటే భక్తే శ్రేష్ఠం.హింస ద్వారా జరిగిన కార్య క్రమాలు కష్టాలే మిగిల్చాయి. అశ్వమేధ యాగం చేసిన తమకు ఈ అరణ్యవాసమెందుకు వచ్చినదని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు " యజ్ఞానికి మంత్రం, కర్త, ద్రవ్యం పవిత్రమయినవై ఉండాలి. నీ తమ్ముళ్ళు బలవంతులయి ఎంతోమందిని చంపి సంపాదించుకొచ్చిన ద్రవ్యం చేత జరుపబడ్డ యజ్ఞము నీకు నెల తిరక్కుండానే అరణ్య వాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి" అంటాడు.యజ్నం అంటే భోజనం.మహా నైవేద్యం అంటే అన్నదానం చేసి కాలేకడుపుల ఆకలి తీర్చటం.బలి అంటే జంతు బలి కాదు.ధ్వజ స్తంభం ముందు బలి పీఠం పైన స్వామి వారి నైవేద్యం భూత తృప్తికై వేయటం.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/బలి" నుండి వెలికితీశారు