"దేవులపల్లి సోదరకవులు" కూర్పుల మధ్య తేడాలు

==దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి==
 
1879లో పిఠాపురం ప్రభువు రావు గంగాధర రామారావు సమక్షంలో నూజివీడు సంస్థాన ఆస్థానకవి మాడభూషి వేంకటాచార్యులు అవధానం చేసి మెప్పించగా, రాజా తమ ఆస్థానములో అట్టి విద్వాంసులు కలరా అని విచారించి దేవులపల్లి సోదరకవులు అంతటి శక్తి కలవారని తెలుసుకొని వెంటనే చంద్రమపాలెం నుండి పిలిపించాడు. సుబ్బరాయశాస్త్రి ఇంతకు ముందు అవధానప్రక్రియ చేపట్టకున్నా రాజావారి అనుజ్ఞపై తమ్మునితో కలిసి శతావధానాన్ని జయప్రదంగా చేసి రాజావారియొక్కయు, సభికులయొక్కయు మన్నికకు పాత్రుడైనాడు. ఈవిధంగా ఈ సోదరకవులు అప్పుడప్పుడు అవధానాలు చేసేవారు.
===సంస్కృత రచనలు==
# శ్రీరామ పంచాశత్తు
# శ్రీమద్రావువంశముక్తావళి
===తెలుగు రచనలు===
# మహేంద్రవిజయము (ప్రబంధము)
# రామరాయవిలాసము (ప్రబంధము)
# మల్హణస్తవము ( సంస్కృతమునుండి అనువాదము)
# [[శ్రీ కుమారశతకము]] (సంస్కృతము నుండి అనువాదము)
# [[మందేశ్వర శతకము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1303968" నుండి వెలికితీశారు