ఖోరాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
<ref>"The Qur'an assumes the reader to be familiar with the traditions of the ancestors since the age of the Patriarchs, not necessarily in the version of the "Children of Israel" as described in the Bible but also in the version of the "Children of Ismail" as it was alive orally, though interspersed with polytheist elements, at the time of the Prophet Muhammad (s). The term Jahiliya (ignorance) used for the pre-Islamic time does not mean that the Arabs were not familiar with their traditional roots but that their knowledge of ethical and spiritual values had been lost." ''Exegesis of Bible and Qur'an'', H. Krausen. http://www.webcitation.org/query?id=1256489759606145&url=www.geocities.com/athens/thebes/8206/hkrausen/exegesis.htm </ref>.
[[యూద మతము|యూదు]], [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] గ్రంధాలలోని వివిధ ఘటనలు ఖొరాన్‌లో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, కొంత భేదాలతోగాని ప్రస్తావించబడ్డాయి.ఖుర్‌ఆన్ యొక్క సాధికారతను ఖొరానే స్పష్టంగా చెప్పింది. ''మిగిలిన విషయాన్ని ఇప్పుడు తెలియజేశాము. దీనికి రక్షణకూడా నిశ్చయంగా మేమే'' అని. <ref>[http://www.usc.edu/dept/MSA/quran/015.qmt.html#015.009 Qur'ān, Chapter 15, Verse 9]</ref><ref>[http://www.usc.edu/dept/MSA/quran/005.qmt.html#005.046 Qur'ān Chapter 5, Verse 46]</ref>
 
ఖుర్ఆను గ్రంథం దాదాపు 1400 సంవత్సరాలకు పూర్వం కారుణ్యమూర్తి మహాప్రవక్త మహమ్మద్(స)పై రమజాను మాసంలో అవతరించింది. ఇది చివరి దైవగ్రంథం. దాదాపు ఇరవైమూడు సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో ఈ గ్రంథం మానవుల అవసరాలకు, ఆ కాల పరిస్థితులకు అనుగుణంగా సందేశాలను మోసుకొచ్చింది. 'ఖుర్ఆన్' అంటే మాటిమాటికి చదివే గ్రంథం అని అర్థం.
 
ఖుర్ఆను అవతరణకు పూర్వం ఈ భూప్రపంచంలో ముఖ్యంగా అరేబియా దేశంలో అసంఖ్యాకమైన చెడులు, దురాచారాలు ప్రబలి ఉండేవి. న్యాయం నశించి అన్యాయం రాజ్యమేలేది. నీతి-నిజాయతీ, మంచితనం, సానుభూతి, ప్రేమ, దయాదాక్షిణ్యాలు, పరస్పర సహాయసహకారాలు... ఏవీ మచ్చుకైనా కనబడేవి కావు. దోపిడులు, హత్యలు సర్వసాధారణమైపోయాయి. ప్రజలు తమ స్వార్థం కోసం ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడేవారు. తెగలు, తెగలుగా విభజితమైన ఆ సమాజంలో ఎప్పుడూ యుద్ధాలు జరిగేవి. తెగల మధ్య శాశ్వత వైరం పడగలు విప్పి కరాళనృత్యం చేసేది. వ్యభిచారం ప్రబలింది. స్త్రీలను ఎంతో హీనంగానూ, నీచంగాను చూసేవారు. వారికి ఎలాంటి హక్కులనూ ఇచ్చేవారు కాదు. దైవభక్తి, దైవభయం నశించిపోయాయి. పరలోకచింతన మచ్చుకైనా ఉండేది కాదు. అరేబియా దేశచరిత్ర రక్తసిక్తమై ఉండేది.
 
అటువంటి దుస్సహ వాతావరణంలో మహమ్మద్(స)పై అవతరించిన ఈ గ్రంథరాజాన్ని ఆనాడు కొంతమంది కల్పితమని దూషించారు. ఆయనవి పిచ్చి రాతలని, అసత్యాలని వ్యతిరేకించారు. మనిషి జీవించే విధానాన్ని చూపించే ఈ గ్రంథాన్ని స్వీకరించినవారు ఆ సమాజంలోనే చాలామంది ఉండేవారు. దాన్ని విశ్వసించిన వారి జీవితాలు సమూలంగా మారిపోయాయి. అవిశ్వాసాలు, అసత్యాలు వారిలోనుంచి అంతరించిపోయాయి. పూర్వకాలం నుంచి వారి పెద్దలు పాటిస్తూ వచ్చిన దురాచారాలు, దుష్టసంప్రదాయాలు కాలగర్భంలో కలిసిపోయాయి.
 
బానిసలు అధమస్థితిలో నుంచి బయటపడి అధికార పీఠాలను అలంకరించారు. దొంగలు, దోపిడిదారులు విశ్వసనీయతగలవారిగా, శాంతికాముకులుగా పరివర్తన చెందారు. జీవించే హక్కునే కోల్పోయిన స్త్రీజాతి పురుషుడితో సమానంగా మరికొన్ని హక్కుల్ని సాధించింది.
 
ఈ ఖుర్ఆను గ్రంథం ఖలీఫా ఉమర్‌బిన్ ఖత్తాబ్(ర) చేతుల్లోకి రాగానే ఆయన హృదయంలో ఆవరించి ఉన్న కారుచీకట్లు తొలగిపోయాయి. నిజమైన ఇస్లామీ చైతన్యస్ఫూర్తి ఆయనకు కలిగింది. ఆయన 'ఫారూఖె ఆజమ్' అనే బిరుదుతో అలంకృతులయ్యారు. ఈ ఖుర్ఆను గ్రంథం తన అనుయాయులకు పటిష్ఠమైన విశ్వాసాన్ని కలిగించింది. వారి హృదయాలు దైవభక్తితో పులకించిపోయాయి. ఆ గ్రంథం ద్వారా వ్యక్తమయ్యే ప్రతి ఆజ్ఞను వారు తు.చ. తప్పకుండా పాటించేవారు. 'ఓ ముస్లిములారా! రుకూ చేసేవారితో కలిసి మీరు కూడా రుకూ చెయ్యండి' అనే ఆజ్ఞ చెవుల్లో పడగానే వారు మసీదుల వైపు పరుగెత్తేవారు. 'వడ్డీని తీసుకోవద్దు, అది నిషిద్ధం' అనే ఆకాశవాణి విన్నంతనే వారి వడ్డీ వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. 'మద్యపానం నిషిద్ధం' అనే దైవాజ్ఞ అవతరించగానే సారాయి కుండలన్నీ బద్దలైపోయాయి.
 
'పరలోకం ఉంది. అక్కడ మీరు చేసిన పాపకార్యాలను ప్రశ్నిస్తారు' అనే ఖుర్ఆను ఆయతు విన్నంతనే పరలోక భయం వారిని పట్టుకుంది. ఈ భయమే వారిని దైవభక్తి పరాయణులుగా, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా, సత్యపాలకులుగా తీర్చిదిద్దింది. నేడు ఆ గ్రంథరాజం మనవద్ద కూడా ఉన్నది. కాని, దానిపై మన విశ్వాసం సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. కనుకనే దాని ఆజ్ఞలన్నింటినీ మనం పాటించటంలేదు. ఇష్టానుసారం కొన్ని ఆదేశాలను హృదయానికి హత్తుకుంటున్నాం. ఇతర ఆదేశాలన్నింటినీ తృణీకరిస్తున్నాం. ఖుర్ఆను గ్రంథం అవతరించిన మాసం ఇప్పుడు మన జీవితంలోకి ప్రవేశించింది. కనీసం ఇప్పుడైనా మనకు కనువిప్పు కలిగితే గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవచ్చు. ఆ గ్రంథాన్ని ఈ మాసంలో అత్యధికంగా పారాయణంచేసి, అవగాహన చేసుకుని, దాని ప్రకారం జీవితాన్ని గడిపి అనన్యమైన పుణ్యఫలాలను పొందవచ్చు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఖోరాన్" నుండి వెలికితీశారు