ఎస్‌.ఆర్‌.శంకరన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళనాడు ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
*సచివాలయానికి ఉదయాన్నే తొమ్మిదన్నరలోగా చేరుకునేవారు. రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేసేవారు.
*మెదక్ జిల్లా ‘ఖానాపూర్’లో వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులను సమావేశపరిచి వారికి వెట్టిచాకిరి నుంచి ఎట్లా విముక్తి కావాలో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి బోధించారు. ఫలితంగా భూస్వాముల వద్ద పనిచేసే జీతగాళ్ళంతా తిరుగుబాటు చేశారు.
*చెన్నారెడ్డితో వెట్టిచాకిరి నిర్మూలన అంశంపై విభేదించిన శంకరన్ గారిని త్రిపుర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరించమని కోరింది. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నృపేన్ చక్రవర్తి. ఆయన కూడా శంకరన్ వలె అవివాహితుడు. శంకరన్ గారికి పాలన విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. త్రిపురలో శంకరన్ ప్రభుత్వ అతిథి గృహంలో ఉండేవారు. ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునేవారు.వివాహం ప్రజాసేవకు అడ్డం కిగా భావించిన ఈ ఇద్దరూ కేవలం రెండుగదుల ఇళ్ళలో నివసిస్తూ రాష్ట్రాన్ని చక్కగా పాలించవచ్చని నిరూపించారు.
*తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని గుర్తేడు గ్రామంలో గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించడానికి వెళ్ళిన సందర్భంలో శంకరన్‌తో సహా దాదాపు 11 మంది అధికారులను మావోయిస్టులు నిర్బంధించారు. ఆ తరువాత 12 రోజులకు విడుదల చేశారు.
*పంజాగుట్టలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఆయన ఇల్లు ఎంతో సాదా సీదాగా ఉండేది. సఫాయి కర్మచారి ఉద్యమానికి ముఖ్య నాయకుల్లో ఒకరుగా, తనకు వచ్చే పెన్షన్‌ డబ్బును దళిత విద్యార్ధుల పైచదువుల కోసం వెచ్చించేవారు. వీధిబాలలు, వికలాంగులకు ఆశ్రమాలు నడిపే స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేసేవారు.
*హైద్రాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ల్లో ఎస్‌.సి, ఎస్‌.టి.లకు చదువుకునే అవకాశం,రిజర్వేషన్లు అమలు చేయించారు.
*నిరంతరం పేదప్రజల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డుకు ఎంపికచేసింది. కాని సన్మానాలకు దూరంగా ఉండే శంకరన్‌ సున్నితంగా తిరస్కరించారు. ఆయన ఎప్పుడూ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. తనకి పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించినప్పుడు దాన్ని తిరస్కరించడమే గాక, ఆ విషయం ప్రచురించవద్దని పత్రికా విలేకరులను ప్రాథేయపడ్డారు.ఆయన మరణించిన తరువాత ప్రభుత్వమే అధికారికంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేసింది.
*2014 మే 25న పూర్ణ, ఆనంద్‌ అనే తెలంగాణ దళిత బాలలు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి శిఖరం మీద జాతీయ పతాకం, అంబేద్కర్‌ చిత్రపటంతో పాటు శంకరన్ గారి చిత్రపటం కూడా ప్రదర్శించారు.
 
* కలెక్టరుగా ఉంటూ నెల్లూరు కనక మహల్‌లో క్యూలో నిలబడి సినిమా టికెట్‌ కొనుక్కున్న వ్యక్తి శంకరన్‌.
* ఒక గ్రామమంత వైశాల్యం ఉన్న బంగళా కలెక్టరు కుటుంబానికి నివాసంగా ఉండటం అనవసరం అని నెల్లూరులోని కలెక్టరు బంగళాని ఉమెన్స్‌ కాలేజీగా మార్చేశారాయన.
* రైలు ఎక్కేటప్పుడు తన పక్కన డఫేదారు వుంటే ఎక్కిన తరువాత తానెవరో తోటి ప్రయాణీకులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుందని తనకి వీడ్కోలు ఇవ్వటానికి వచ్చే అధికారుల్ని కూడా పక్కన డఫేదారు ఉండకూడదనే షరతుపైనే అక్కడకు రానిచ్చేవారు.
*పదవీ విరమణ తరువాత మన రాష్ట్రంలోనే స్థిరపడి 2010 అక్టోబరు 7న హైదరాబాద్‌లో డెబ్బయ్యారేళ్ళ వయసులో చనిపోయారు*
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎస్‌.ఆర్‌.శంకరన్" నుండి వెలికితీశారు